MoviesTollywood news in telugu

వెండితెరపై అలాంటి పాత్రలు చేసిన నటులు…ఎంత మందో..?

Tollywood Heroes :నటుడు అంటే అన్ని రకాల పాత్రలు వేయాలి. అన్నింటా మెప్పించాలి. కొన్ని పాత్రలకే పరిమితం అయితే సంపూర్ణ నటుడు అవ్వలేడు. అలాగే గాయకులు కూడా అన్ని రకాల పాత్రలను పాడినప్పుడే మంచి సింగర్ అనిపించుకుంటారు. అది భక్తి కావచ్చు, రక్తి కావచ్చు, హాస్యం కావచ్చు. హీరోలు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినపుడు పాత్రను చూడాలే తప్ప ఇమేజ్ కాదు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నర్తనశాల పౌరాణిక మూవీలో బృహన్నల పాత్రలో ఇమిడిపోయారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కూడా ఆయనకు పాటపాడారు. ఆ సినిమా అజరామరమైంది. ఇలా అప్పటి నటులు ఇలాంటి పాత్రలకు ఏమాత్రం వెనుకాడేవారు కాదు. అయితే ఇప్పుడు యంగ్ హీరోలు కూడా అలాంటి పాత్రలకు రెడీ అవుతున్నారు.

అదే నర్తనశాల పేరిట సాంఘిక చిత్రం తీస్తే అందులో నాగసూర్య కూడా బృహన్నల పాత్ర వేసి, ప్రేమికురాలికి దగ్గరవుతాడు. అయితే ఈ మూవీ ఆడలేదు. ఇక అల్లుడు అదుర్స్ మూవీలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తేడా క్యారెక్టర్ చేసినా జనం పెద్దగా ఆదరించలేదు. ఇక హారర్ మూవీస్ కి కామెడీ జోడించి రాఘవ లారెన్స్ చేసిన కాంచన లాంటి సినిమాలతో అలరించాడు. మసాలా మూవీలో ప్రేమించిన అమ్మాయికి దగ్గరవడానికి హీరో రామ్ పోతినేని తేడా పాత్రలో ఆమె అన్నయ్యకు దగ్గరవుతాడు.