పెళ్లి కానుక హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో…?
pelli kanuka Heroine Lakshmi :చిత్ర పరిశ్రమ ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో,ఎవరిని పడడోస్తుందో తెలీదు. ఈ మాయా ప్రపంచంలో నిలబడాలంటే టాలెంట్,అభినయంతో పాటు లక్కు ఉండాలి. లేకపోతె రాణించడం కష్టం. అందుకే ఇండస్ట్రీకి వచ్చినవాళ్లలో చాలామంది ఒకటి రెండు సినిమాలతోనే ఛాన్స్ లు రాక దూరమైపోతారు.
ఇలాంటి కోవాలనే జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్లికానుక మూవీలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లక్ష్మి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిందని టాక్. ఎక్కడ ఉందొ ఏమిటి అనే వివరాలు తెలియడం లేదు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు.
ఇక పెళ్లికానుక తర్వాత ఛాన్స్ లు రాకపోవడంతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన నాగాస్త్రం ధారావాహిక సీరియల్ లో మంచి పేరు తెచ్చుకున్న లక్ష్మి ఆతర్వాత నాగేశ్వరి వంటి ధారావాహిక సీరియల్స్ లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆతర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.