వినాయక్ కెరీర్ లో టాప్ 10 సినిమాలు…మీరు చూసారా…?
Vinayak Top 10 Movies :టాలీవుడ్ లో నితిన్ మొదలుకుని మెగాస్టార్ వరకూ అందరికీ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్. జూనియర్ ఎన్టీఆర్ తో వినాయక్ తెరకెక్కించిన సినిమా ఆది. నిజానికి వినాయక్ కి మొదటి సినిమా అయినా పది మూవీస్ తీసిన అనుభవం గల డైరెక్టర్ గా చేసాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ చెలరేగిపోయి నటించిన ఈ మూవీ వినాయక్ కి మంచి ఇమేజ్ తెచ్చింది.
మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీ తర్వాత బాలకృష్ణతో డబుల్ రోల్ చేయిస్తూ 2002లో వినాయక్ తీసిన చెన్నకేశవ రెడ్డి మూవీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తోనే నడుస్తుంది. టబు, శ్రేయ హీరోయిన్స్. మణిశర్మ మ్యూజిక్ అందించారు. 2003లో నితిన్ హీరోగా వినాయక్ తీసిన మూవీ దిల్. ఈ సినిమాతోనే నిర్మాత రాజుకి దిల్ రాజు అనే పేరు వచ్చింది.
సమాజంలో జరిగే అన్యాయం,అక్రమాలపై ఓ ప్రొఫెసర్ ఏవిధంగా తిరగబడ్డాడో చూపిస్తూ 2003లో వినాయక్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఠాగూర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మణిశర్మ సాంగ్స్ అదిరిపోయాయి. శ్రేయ,జ్యోతిక హీరోయిన్స్. సునీల్ కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో వినాయక్ ఓ పాత్ర లో కనిపిస్తాడు. తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించిన ఈ మూవీ వినాయక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది.
విక్టరీ వెంకటేష్ తో 2006లో వినాయక్ తీసిన మూవీ లక్ష్మీ. నయనతార హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో వెంకీ చేత కత్తి పట్టించి విలన్లను వేటాడించిన తీరు అద్భుతం. వేణు,తెలంగాణ శకుంతల, బ్రహ్మానందం కామెడీ పండింది. మణిశర్మ, రమణ గోగుల మ్యూజిక్ అందించారు.
అల్లు అర్జున్ హీరోగా వినాయక్ 2005లో తెరకెక్కించిన సినిమా బన్నీ.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు, ఈ మూవీ తర్వాతే అల్లు అర్జున్ ని బన్నీ అని పిలవడం స్టార్ట్ చేసారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి.
ఇక మాస్ మహారాజ్ రవితేజా హీరోగా వినాయక్ తీసిన కృష్ణ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2008లో వచ్చిన ఈ మూవీలో త్రిష హీరోయిన్. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ మూవీ లో కత్తి పట్టి మరీ రవితేజ చెలరేగిపోయాడు. చక్రి మ్యూజిక్ అదిరింది. జూనియర్ ఎన్టీఆర్ చేత డబుల్ రోల్ వేయించి,కామెడీ,యాక్షన్ ఫార్ములాతో వినాయక్ తీసిన మూవీ అదుర్స్. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
రామ్ చరణ్ హీరోగా వినాయక్ తెరకెక్కించిన మూవీ నాయక్. 2013లో వచ్చిన ఈ మూవీలో చెర్రీ డబుల్ రోల్ చేసాడు. కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్స్ .ఇక చిరంజీవి రాజకీయాలనుంచి సినిమాల్లోకి వచ్చాక ఖైదీ నెంబర్ 150తో 2017లో రీ ఎంట్రీ ఇవ్వగా,ఈ మూవీకి వినాయక్ డైరెక్షన్ చేసాడు. చిరంజీవిని 20ఏళ్లకు వెనక్కు తీసుకెళ్లి, ఫాన్స్ ని అలరించేలా ఈ సినిమా తెరకెక్కించడంలో వినాయక్ చాలా శ్రమించాడు. అందుకు తగ్గట్టు సంచలన విజయం వరించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదిరింది.