MoviesTollywood news in telugu

చందమామ బ్యూటీ అత్తారింట్లో ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood Heroine Kajal :కరోనా సమయంలోనే పరిమిత జనం నడుమ పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కల్సి ఆచార్య షూటింగ్ లో పాల్గొంది. తాజాగా బాలీవుడ్ మూవీ ఉమా మూవీలో చేస్తోంది. అలాగే ఘోష్టి అని తమిళ మూవీలో చేస్తోంది. ఇంకా పలు తమిళ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున నటించే యాక్షన్ మూవీలో కూడా ఈ చందమామ కాజల్ నటించబోతోందట. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వైవాహిక జీవితం ఆనందంగా సాగిస్తోంది. సాధారణంగా అత్తారిల్లు ఎలా ఉంటుందో అనే అనుమానం, భయం సహజం. కానీ కాజల్ అత్తారింట్లో అల్లుకుపోతోంది.

ప్రస్తుతం భర్తతో కల్సి ముంబైలో మకాం పెట్టిన కాజల్ తన అత్తగారి దగ్గర ధ్యానం నేర్చుకుందట. ఆమె ప్రతిరోజూ ధ్యానం చేయడం వలన కాజల్ కూడా అలవాటు చేసుకుంది. ఇక లాక్ డౌన్ సమయంలో అల్లికలు, క్రొచింగ్ వంటివి కూడా నేర్చుకుందట. మొత్తానికి అత్తగారి దగ్గర మంచి మార్కులే కొట్టేసిందని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."