MoviesTollywood news in telugu

హీరోయిన్ అశ్విని గుర్తు ఉందా…కొన్ని నమ్మలేని నిజాలు

Tollywood Heroine Ashwini :అభినయం,అందం కలగలసిన హీరోయిన్ గా అశ్విని తెలుగు సినిమాలతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో హోమ్లి హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఈమె 1969జులై 14న నెల్లూరు జిల్లాలో పుట్టింది. అలనాటి మేటి నటి,దర్శకురాలు,గాయని అయిన భానుమతి డైరెక్ట్ చేసిన భక్తద్రువ మార్కండేయ మూవీలో బాలనటిగా అశ్విని ఎంట్రీ ఇచ్చింది. 1985లో నందమూరి బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు మూవీతో హీరోయిన్ గా ప్రవేశించింది. కలియుగ పాండవులు మూవీలో విక్టరీ వెంకటేష్ మేనత్త కూతురిగా నటించింది.

తెలుగులో పలు సినిమాలతో పాటు తమిళ,మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 150మూవీస్ లో నటించిన అశ్విని దాదాపు 10 ఏళ్లపాటు ఇండస్ట్రీలోనే ఉంది. నాగార్జున అరణ్యకాండ, సూపర్ స్టార్ కృష్ణ నటించిన కొడుకు దిద్దిన కాపురం,కల్యాణ చక్రవర్తితో ఇంటిదొంగ,డాక్టర్ రాజశేఖర్ తో అమెరికా అబ్బాయి. రాజేంద్ర ప్రసాద్ తో పెళ్లిచేసి చూడు, పూలరంగడు, స్టేషన్ మాస్టర్, అలాగే చూపులు కల్సిన శుభవేళ, అనాదిగా ఏడాది వంటి సినిమాల్లో అశ్విని నటించింది. రాజేంద్రప్రసాద్ సినిమాల్లో ఈమె ఎక్కువగా నటించింది.

లివర్ సంబంధిత వ్యాధితో బాధపడే అశ్విని 1980 – 1990 మధ్యకాలంలోనే మూవీస్ లో నటించగలిగింది.చికిత్స కారణంగా చెన్నైలోనే ఉండి పోవడంతో తమిళనటుడు,దర్శకుడు పార్తీబన్ ఆమెతో ఓ సినిమా చేయించాలని భావించాడు. కానీ ఆ మర్నాడే చెన్నైలోని రామచంద్ర మిషన్ హాస్పిటల్ లో 2012 సెప్టెంబర్ 24న కన్నుమూసింది. ఈమెకు పెళ్లి కాలేదు. అయితే కార్తీక్ అనే ఓ కొడుకుని పెంచుకోవడంతో అతడి బాధ్యతలను పార్తీబన్ చూసాడు.