కార్తీకదీపం సీరియల్ హీరో బ్రాండ్ అంబాసిడర్…బ్రాండ్ ఏమిటో…?

Karthika deepam Serial Karthik :సినిమాలతో సమానంగా సీరియల్స్ కి కూడా డిమాండ్ ఉండడంతో బుల్లితెర నటులకు మంచి క్రేజ్ వస్తోంది. దానికితోడు ధారావాహికంగా నడుస్తున్న సీరియల్స్ లో నటీనటులు తమ నటనతో ఆడియన్స్ కి మరింత దగ్గరవుతున్నారు. ఇప్పుడొస్తున్న సీరియల్స్ లో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్ కార్తీక దీపం.

ఇందులో వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాధ్, డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాల నటిస్తూ మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. సినిమా నటుల మాదిరిగానే ఈ బుల్లితెర హీరో కూడా యాడ్స్ లో చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. తాజాగా పేటీఎం వాడకం గురించి చేసిన యాడ్ టీవీల్లో రావడంతో మరింత క్రేజ్ వచ్చేసింది.

బుల్లితెర మీద తమ నటనతో అలరిస్తున్న నటీనటులను పలు యాడ్స్ లో చేయిస్తూ,సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రచారం సాగించు కుంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా టివి లో పేటీఎం యాడ్ తో నిరుపమ్ పరిటాల ఆకట్టుకుంటున్నాడు.గతంలో గ్రీన్ టీ ప్రోడక్ట్ కి యాడ్స్ లో నటించిన నిరుపమ్ పరిటాల క్రేజ్ మాములుగా లేదు.