బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్‌గా ఎదిగిన నటులు…ఎంత మంది…?
Tollywood Stars :సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే అలాంటి పరిశ్రమలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి సక్సెస్ అయినా స్టార్స్ కొంతమంది ఉన్నారు వారి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది
నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిశ్రమకు వచ్చి అష్టా చమ్మా సినిమాతో హీరో గా మారాడు
మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన విజయ్ సేతుపతి డేట్స్ కోసం ఇప్పుడు నిర్మాతలు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు
పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టి అర్జున్ రెడ్డితో ఎదిగి గీతా గోవిందం సినిమా తో స్టార్ హీరో గా మారి ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ
యశ్ కన్నడలో వారసులను తట్టుకుని నిలబడి సూపర్ స్టార్ అయ్యాడు కే జి ఎఫ్ సినిమాతో ఇండియా మొత్తం యశ్ గురించి తెలిసిపోయింది
శివ కార్తికేయన్ యాంకర్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు
ఆయుష్మాన్ ఖురానా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకుని స్టార్ హీరోగా మారాడు. వీరంతా ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారంటే వారి వెనుక ఉన్నది బ్యాక్గ్రౌండ్ కాదు కేవలం టాలెంట్ మాత్రమే.