MoviesTollywood news in telugu

రవితేజ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood Heroine Gopika :సినిమా ఇండస్ట్రీ చిత్ర విచిత్రమైనది. అందుకే ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటోందో తెలీదు. కొందరు ఎన్ని సినిమాలు చేసినా హిట్స్ దక్కవు. కొందరు మొదటి సినిమా నుంచే దూసుకుపోతారు. ఇక కొందరు కొద్దిసినిమాలు మాత్రమే చేసి,ఇండస్ట్రీకి దూరంగా జరిగిపోతారు. అయితే ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఇలాంటి వాళ్లలో హీరోయిన్ గోపిక ఒకరు. తెలుగు,మలయాళ,కన్నడ భాషా చిత్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం గోపిక ఆస్ట్రేలియాలో ఉంటోంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అజిలేష్ ని ప్రేమించి పెళ్లాడింది. దాంతో సినిమాలను వదిలేసింది. ఫ్యామిలీతో హాయిగా గడుపుతున్న ఈమె తన ఇద్దరు పిల్లలు, భర్తతో కల్సి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. బాగుందని కామెంట్స్ పెడుతూ,సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నారు. నిజానికి ఈమె ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చింది.

కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీకి స్టడీస్ సమయంలోనే సినిమా ఛాన్స్ లు వచ్చాయి. దాంతో మలయాళంలో జయసూర్య,వినీత్ లతో కల్సి చేసిన తొలిసినిమా నిరాశ పరిచింది. కానీ గోపిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఛాన్స్ లు వచ్చాయి. మాస్ మహారాజ రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ మూవీలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన గోపిక తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. ఆ సినిమాలో ఆమె నటనకు జనం ముగ్దులయ్యారు. దాంతో లేతమనసులు,ముద్దుల కొడుకు,వీడు మామూలోడు కాదోయ్ వంటి మూవీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."