బుల్లితెర నటి భావన తన సంపాదన ఏంచేస్తోందో తెలుసా ?

Tv serial actress bhavana remuneration :సినిమా స్టార్స్ తో సమానంగా బుల్లితెర స్టార్స్ కి ఇమేజ్ ఉంది. పైగా రోజూ సీరియల్ లో కన్పించడం వలన తమ ఇంట్లో మనుషులుగా ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోవడం సహజంగా కన్పిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రాణించలేకపోయిన వాళ్ళు సైతం బుల్లితెరను ఏలేస్తున్నారు. ఇక సంపాదన కూడా ఎక్కువే ఉంటోంది. విలన్ షేడ్ గల పాత్రల్లో రాణిస్తూ కొందరు రోజుకి 20నుంచి 25వేలు అందుకుంటున్నారు.

కొందరు ఆస్తులు కూడబెట్టుకుంటుంటే మరికొందరు ఛారిటీకి ఖర్చు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇక ఒకప్పుడు సినిమాల్లో నటించి ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న భావన తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోందని,తద్వారా మానవత్వాన్ని చాటుకుంటోందని టాక్.

భావన రోజుకి 7వేల రూపాయల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటోంది. నెగెటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ తన నటనతో బుల్లితెర ఆడియన్స్ కి భావన దగ్గరైంది. అయితే ఇంట్లోవాళ్ల పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి కార్యక్రమాలు వస్తే, వేడుకలు చేయకుండా పొదుపు చేసి, ఆ సొమ్ములను క్యాన్సర్ రోగులకు సాయంగా అందిస్తోందట. అందుకే చాలామంది ఈమెను అభినందిస్తున్నారు.