నువ్వే కావాలి సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Nuvve Kavali Movie :లవర్ బాయ్ తరుణ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన నువ్వే కావాలి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఉషాకిరణ్ మూవీస్ రామోజీరావు,స్రవంతి మూవీస్ రవికిశోర్ సంయుక్తంగా తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ మూవీ భారీ ఎత్తున లాభాలు తెచ్చిపెట్టింది. హీరోయిన్ రిచాకు కూడా ఇదే తొలిసినిమా.కె విజయ భాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో కోటి సమకూర్చిన సంగీతంతో సాంగ్స్ అన్నీ సూపర్.

2000అక్టోబర్ 13న రిలీజైన ఈ మూవీ అప్పట్లో యూత్ లో క్రేజ్ తెచ్చింది. కోటి 20లక్షలతో సినిమా తీస్తే, 20కోట్లు కలెక్షన్స్ రాబట్టి, ఇండస్ట్రీ హిట్ అయింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిల్చి, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు సైతం సాధించింది.

ఈ సినిమాకు రెండు వారాల ముందుగా సెప్టెంబర్ 29న రిలీజైన నాగార్జున నటించిన ఆజాద్ మూవీ లో సౌందర్య,శిల్పాశెట్టి హీరోయిన్స్. మణిశర్మ సంగీతం. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీదత్ నిర్మించిన ఈ మూవీని తిరుపతి స్వామి తెరకె క్కించాడు. ఎబో ఏవరేజ్ గా నిల్చింది.

అలాగే నువ్వే కావాలి మూవీకి 11రోజుల ముందుగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన వంశీ మూవీ అక్టోబర్ 1న రిలీజయింది. బి గోపాల్ డైరెక్ట్ చేసారు. అయితే నువ్వే కావాలి భారీ హిట్ అందుకోవడంతో వంశీ నష్టపోయింది.ఇక విక్టరీ వెంకటేష్ నటించిన జయం మనదేరా మూవీ నువ్వేకావాలికి వారం ముందు వచ్చింది. వెంకీ డబుల్ రోల్ చేసాడు.

సౌందర్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని,34సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 12కోట్ల షేర్ రాబట్టింది. నువ్వే కావాలి మూవీకి వారం తర్వాత అక్టోబర్ 20న వచ్చిన ఆమ్మో ఒకటో తారీఖు మూవీ డీసెంట్ గా వచ్చి,విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్,రాశి నటించిన ఈ మూవీలో ఎల్బీ శ్రీరామ్ నటన అద్భుతం.

కమల్ హాసన్ ఓ మానసిక రోగి పాత్రలో నటించిన తెనాలి మూవీని కె ఎస్ రవికుమార్ తెరకెక్కించాడు. అయితే ఈ మూవీ అక్టోబర్ 26న రిలీజై, ప్లాప్ గా నిల్చింది. నువ్వే కావాలి మూవీ మొదటి స్థానంలో నిలవగా,జయం మనదేరా,ఆజాద్,ఆమ్మో ఒకటో తారీఖు తర్వాత స్థానాల్లో నిలుస్తాయి.