MoviesTollywood news in telugu

కస్తూరి సీరియల్ రజని రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించిందో…?

Kasturi serial Rajni Real Life :స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కస్తూరి సీరియల్ లో నటిస్తున్న నటీనటులు తమ అభినయంతో,అందంతో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఇక ఇందులో మోసానికి గురైన తల్లి క్యారెక్టర్ లో రజని తన నటనతో బాగా ఆకట్టుకుంటోంది. ఈమె అసలు పేరు మాధవి వర్ష. అందరూ మాధవి, వర్ష అని పిలుస్తారు. చిన్నప్పుడే వెండితెర మీద కన్పించి ఎన్నో సినిమాల్లో నటించింది. తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నువ్వే కావాలి మూవీలో సెకండ్ హీరోయిన్ గా వర్ష చేసింది.

ఆ సినిమాలో వర్ష పేరు పెట్టడం, పాపులర్ కావడంతో మాధవి అని కాకుండా వర్ష గా వాడుకలోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి ఎంకరేజ్ మెంట్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, పలు సినిమాల్లో చేసింది. డిగ్రీ పూర్తయ్యాక పంజరం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వాసు,సుస్వాగతం,నువ్వే కావాలి, ఖైదీ గారు,సూర్య వంశం,ఆహా,తమ్ముడు,నువ్వొస్తావనీ,నాగ,ప్రియమైన నీకు, మాస్ వంటి పలు సినిమాల్లో చేసింది

ముఖ్యంగా హీరోయిన్ కి ఫ్రెండ్, హీరో చెల్లెలు పాత్రల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న వర్ష దాదాపు 30సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. 6సీరియల్స్ లో నటించింది. పెళ్లయ్యాక ఇండస్ట్రీకి దూరమైంది. అయితే బుల్లితెరపై సీరియల్స్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. సుందరకాండ,తొలిప్రేమ, మనసు మమత,అత్తారింటికి దారేది, శ్రీమతి గాజులు వంటి సీరియల్స్ లో నటించింది. హీరోయిన్ ఐశ్వర్య తల్లిగా కస్తూరి సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తూ మంచి నటన కనబరుస్తోంది.