సమాజంపై భారీ ప్రభావాన్ని చూపిన టాప్ సినిమాలు…మీరు చూసారా
Top 10 Telugu Message Oriented Movies :సినిమా వినోదం,వ్యాపారాత్మకే కాకుండా సామాజిక బాధ్యతను కూడా నెరవేర్చి ప్రజల్లో చైతన్యం తెస్తాయని కొన్ని సినిమాలు నిరూపించాయి. గూడవల్లి రామబ్రహ్మం డైరెక్షన్ లో 1930లో వచ్చిన మాలపిల్ల మూవీ అంటరానితనం,కుల వివక్షత,కులాంతర వివాహం,దళితుల ఆలయ ప్రవేశానికి అడ్డంకులను ఆవిష్కరించింది. బ్రాహ్మణ యువకుడు, దళిత యువతి చుట్టూ తిరిగిన ఈ సినిమా పై కొందరు విమర్శలు గుప్పించారు. అయితే ఈ సినిమా తర్వాత దళితులకు ఆలయ ప్రవేశం చాలా చోట్ల జరగడం విశేషం.బాక్సాఫీస్ పరంగా కూడా విజయం అందుకుంది.
ఇక సూపర్ స్టార్ కృష్ణ హీరోగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట తీసిన మూవీ అప్పట్లో దేశభక్తిని చాటి చెప్పింది. 1974లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు రేపింది. తెలుగు సినిమా చరిత్రలో రెండు కోట్లు వసూలు చేసింది. స్కూల్స్ ,కాలేజీల్లో సీతారామరాజు గెటప్స్ లో వందేమాతరం అనడం ఈ సినిమాతోనే మొదలైంది.
1930నుంచి 1948వరకూ తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనను, వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన వీర కార్మికుల గురించి ఆవిష్కరిస్తూ,కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా మా భూమి. ప్రముఖ దర్శకుడు గౌతమ్ ఘోష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 1980లో రిలీజై, కమర్షియల్ గా కూడా హిట్ అయింది. ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. వంద గొప్ప భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిల్చింది. బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ రైటర్, బెస్ట్ ఫిలిం అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చాయి.
తెలుగు చలన చిత్ర చరిత్రలో శంకరాభరణం మూవీ ఒక ట్రెండ్ సెట్టర్. కళాతపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వంలో 1980లో వచ్చిన ఈ సినిమాతో చాలామంది సంగీతం నేర్చుకునేలా చేసింది. సంగీత పాఠశాలలు కొత్తగా అవతరించాయి. తమ పిల్లలకు సంగీతం నేర్పిచేలా చేసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు అందుకుని, పలు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుంది. తెలుగులోనే కాదు,తమిళం,మలయాళం లో కూడా ఈ మూవీ హిట్ అయింది.
అలాగే మాదాల రంగారావు నిర్మించిన యువతరం కదిలింది మూవీ 1980లో వచ్చి, విద్యార్థుల్లో విప్లవ భావాలను, చదువు పట్ల శ్రద్ధ నేర్పించింది. చాలాచోట్ల విద్యార్థులు పోరాటాలు చేసేలా చేసిన ఈ మూవీ కమర్షియల్ గా కూడా సక్సెస్ అందుకుంది.
మాస్ మూవీస్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్తగా ట్రై చేసిన రుద్రవీణ మూవీ 1988లో వచ్చింది. కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ పలు అవార్డులు దక్కాయి. క్లాసిక్ మూవీగా నిల్చింది.
తెలంగాణలో దొరలపెత్తనంపై తిరగబడ్డ తెలంగాణ తెలుగు బిడ్డ కథనంతో దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఒసేయ్ రాములమ్మ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. విజయశాంతి టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది. 1997లో వచ్చిన ఈ మూవీ సాంగ్స్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిల్చింది. టాప్ గ్రాసర్ మూవీగా నిల్చింది.
ఇక ప్రేమ, దోమ అంటూ తల్లిదండ్రులను, విద్యను నిర్లక్ష్యం చేసేవారికి కనువిప్పు కల్గిస్తూ తీసిన సుస్వాగతం మూవీ 1998లో రిలీజయింది. పవన్ కళ్యాణ్ కి తొలి సూపర్ హిట్ మూవీ. ఈ సినిమా చూసి తమను తాము ఉత్తమ పౌరులుగా మలుచుకున్న ఘటనలు ఈ సినిమా తర్వాత చాలా జరిగాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2015లో వచ్చిన శ్రీమంతుడు మూవీ పల్లెల దత్తత నేపథ్యంలో తీశారు. ఈ సినిమా వచ్చాక చాలామంది తమ ఊళ్లలో రోడ్లు వేశారు. కొందరు ధనవంతులు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసారు. 85కోట్లు కలెక్ట్ చేసి, నాన్ బాహుబలి హిట్ గా నిల్చింది.
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా లో వచ్చిన మహర్షి మూవీ కూడా మంచి మెసేజ్ ఇచ్చింది. ఓ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఓ గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ మూవీ ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో కదలిక తెచ్చింది. 2019లో వచ్చిన ఈ మూవీ వేరే వృత్తుల వాళ్ళు కూడా వ్యవసాయాన్ని స్వీకరిచేలా చేసింది.

