MoviesTollywood news in telugu

ఈ హీరోల పరిస్థితి ఏమిటి…హిట్ ట్రాక్ ఎప్పుడు ఎక్కుతారో…?

Tollywood Young heroes :సినిమా పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఉవ్వెత్తున్న ఎగిసిన కెరటంలా దూసుకొచ్చిన హీరో హీరోయిన్స్ వరుస ప్లాప్ లతో తెరమరుగవుతారు. అలాంటి వారిలో పలువురు యంగ్ హీరోలున్నారు.

ఆర్ ఎక్స్ 100మూవీతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ వరుస డిజాస్టర్స్ తో ఇండస్ట్రీలో నిలబడలేని పరిస్థితి కి వచ్చేస్తున్నాడు. హిప్పీ,గుణ 369,90ఎం ఎల్ తాజాగా చావు కబురు చల్లగా మూవీస్ చేసినా హిట్ దక్కలేదు. ప్రస్తుతం రాజా విక్రమార్క మూవీలో చేస్తున్నప్పటికీ మూవీ మేకర్స్ ఎవరూ పట్టించుకోవడం లేదని టాక్.

ఇక హ్యాపీడేస్ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ సందేశ్ ఆతర్వాత కొత్త బంగారు లోకం వంటి హిట్ మూవీస్ చేసినప్పటికీ వరుస పరాజయాలతో ఛాన్స్ లు రావడం లేదు. దాదాపు 25 చిత్రాల్లో నటించిన వరుణ్ ఇక తెరమరుగయినట్లేనని టాక్.

అలాగే ఉయ్యాలా జంపాల మూవీతో హిట్ కొట్టి, వరుస విజయాలు చూసిన రాజ్ తరుణ్ ఆతర్వాత ప్లాప్ ల బాట పట్టడంతో ఛాన్స్ లు దక్కడంలేదు. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసిన యితడు ఇండస్ట్రీకి వచ్చాక దాదాపు 15మూవీస్ లో చేసాడు.

సాయికుమార్ కొడుకు ఆది 2011లో ప్రేమ కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, హిట్ అందుకుని, ఫిలిం ఫేర్ అవార్డులు కూడా కొట్టాడు. లవ్లీ వంటి మూవీస్ చేసినా, ఆ తర్వాత నుంచి హిట్ దక్కడంలేదు.

వీళ్ళే కాదు,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ ల పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. ఢీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్అందుకున్న విష్ణు తర్వాత కొన్ని హిట్ మూవీస్ చేసాడు. అయితే ఇతడికి కూడా వరుస పరాజయాలు రావడంతో దాదాపు 25సినిమాలు చేసిన ఇతడి పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం చేసింది.

అలాగే 2004లో దొంగ దొంగది మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కూడా పాతిక సినిమాలు చేసాడు. బిందాస్ మూవీతో స్పెషల్ జ్యురీ నంది అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ఎక్కువ సినిమాలు ప్లాప్ కావడంతో ఇతడి పరిస్థితి కూడా ఇండస్ట్రీలో నిలబడేలా లేదు.