ఇడియట్ సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

Ravi teja Idiot Movie :పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రవితేజ నటించిన ఇడియట్ మూవీ అప్పట్లో యూత్ కి క్రేజీ మూవీ. ఓ చంటిగాడి ప్రేమకథ ట్యాగ్ లైన్ తో 2002 ఆగష్టు 12న రిలీజైన ఈ సినిమాకు చక్రి మ్యూజిక్ అదనపు ఆకర్షణ. రక్షిత హీరోయిన్. ఆమె తండ్రి పాత్రలో డిఎస్పీ గా ప్రకాష్ రాజ్ నటన అద్భుతం.

బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ మూవీ కి పోటీగా వచ్చిన సినిమాల విషయంలోకి వెళ్తే .. ఇడియట్ వచ్చిన మర్నాడే ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన సినిమా సొంతం. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో నమిత హీరోయిన్. రోహిత్ కూడా నటించాడు. సునీల్ కామెడీ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.మంచి రిజల్ట్ రాబట్టిన మూవీ ఇది.

అయినా ప్రభంజనాన్ని కొనసాగిస్తున్న ఇడియట్ కి పోటీగా ఆగస్టు 30న రియల్ హీరో శ్రీహరి డబుల్ రోల్ నటించిన పృథ్వి నారాయణ మూవీ వచ్చింది. శ్రీహరి సొంత సినిమా అయిన దీనికి పి వాసు డైరెక్టర్. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.

ఇదే రోజున ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ మూవీ రిలీజయింది. రిచా హీరోయిన్. ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది. ఇక అదే రోజున కమల్ హాసన్ నటించిన పంచతంత్రం మూవీ. రమ్యకృష్ణ, సిమ్రాన్ గ్లామర్ ఆకట్టుకోగా,ఈ మూవీ బిలో ఏవరేజ్ అయింది.

ఇలా ఇడియట్ తర్వాత వచ్చిన ఈ సినిమాలు దాని విజయాన్ని ఆపలేకపోయాయి. ఇక ఇడియట్ కి వారం ముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాబా మూవీ రిలీజయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని చవిచూసింది. మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సురేశా కృష్ణ డైరెక్ట్ చేసాడు.

ఇడియట్ కి రెండు వారాల గ్యాప్ తో సెప్టెంబర్ 6న రిలీజైన డాక్టర్ రాజశేఖర్ నటించిన భరత్ సింహారెడ్డి విజయాన్ని అందుకోలేక ఏవరేజ్ అయింది. రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో మీనా హీరోయిన్. సూర్య ప్రకాష్ డైరెక్ట్ చేసాడు.