సుమన్ మొదటి సినిమా తరంగిణి సినిమాతో పోటీ పడిన సినిమాల పరిస్థితి…?
Suman Tarangini Movie : అప్పటివరకూ తమిళంలో చేస్తూ తరంగిణి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సుమన్ తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు,వరుస విజయాలతో స్టార్ హీరో అయ్యాడు. ఇందులో భానుచందర్ కూడా నటించాడు. సుమన్, భానుచందర్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే తరంగిణి మూవీకి చాలా సినిమాలు పోటీగా వచ్చాయి. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన తరంగిణి మూవీ 1982నవంబర్ 5న రిలీజయింది 365డేస్ విజయవంతంగా ఆడింది.
తరంగిణి రిలీజ్ అయిన మర్నాడే చిరంజీవి నటించిన మొండిఘటం మూవీ రిలీజయింది. రాధిక హీరోయిన్. ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది. అయితే నవంబర్ 19న వంశీ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన మంచు పల్లకీ రిలీజయింది. సుహాసిని హీరోయిన్. ఇందులో నలుగురు నిరుద్యోగ యువకుల్లో చిరంజీవి ఒకడు. ఈ మూవీ హిట్ గా నిల్చింది. అక్టోబర్ 22న చిరంజీవి నటించిన యమకింకరుడు రిలీజయింది. ఏవరేజ్ గా నిల్చింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన షంషేర్ శంకర్ అక్టోబర్ 21న రిలీజై, భారీ ఓపెనింగ్స్ తెచ్చింది. అయితే సినిమా ప్లాప్ గా నిల్చింది.
అక్టోబర్ 27న నటరత్న ఎన్టీఆర్ నటించిన నాదేశం మూవీ రిలీజయింది. 19రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేసిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అందాల నటుడు శోభన్ బాబు నటించిన ఇల్లాలి కోరికలు మూవీ అక్టోబర్ 28న రిలీజై, మంచి విజయాన్ని అందుకుంది. తరంగిణి మూవీకి రెండు రోజుల ముందు చంద్రమోహన్, మోహన్ బాబు నటించిన కొత్తనీరు మూవీ ప్లాప్ అయింది.