మెగాస్టార్ చెల్లి పాత్ర కోసం కీర్తి సురేష్ పారితోషికం ఎంతో తెలుసా ?
keerthy suresh remuneration :చిరంజీవితో నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఏ మాత్రం అవకాశం వచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ నటిస్తూ ఉంటారు. అవసరమైతే కొన్ని పనులను వాయిదా వేసుకుని మరీ మెగాస్టార్ తో నటించడానికి సిద్ధం అవుతారు. ఇక విషయంలోకి వస్తే కీర్తి సురేష్ కి మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం వచ్చింది.
చిరంజీవికి చెల్లెలి పాత్ర నటించడానికి సిద్ధం అయింది. ఈ పాత్ర కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చెల్లి గా నటిస్తోంది.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ కాస్త భిన్నంగా గ్లామర్ పాత్రలకు దూరంగా హోమ్లీ బ్యూటీ తోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.
భోళా శంకర్ సినిమా లో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయ్యేలా సిస్టర్ ఎమోషన్ గట్టిగా ఎలివేట్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం చాలామంది అగ్రహీరోయిన్ సంపాదించినప్పటికీ ఫైనల్ గా కీర్తి సురేష్ ని ఫిక్స్ చేశారట. సినిమా కి రెండు కోట్లు తీసుకునే కీర్తి సురేష్ ఈ సినిమాకు మాత్రం ఏకంగా మూడు కోట్లు అడిగినట్లు తెలుస్తోంది.