హీరో కార్తికేయ పెళ్లి చేసుకోబోయే ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

Karthikeya Fiance Lohitha :ఆర్ ఎక్స్ 100, గుణ 369 సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న కార్తికేయ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన చావుకబురు చల్లగా సినిమా లో భస్తి బాలరాజుగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది.

ఇక అసలు విషయంలోకి వస్తే కార్తికేయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా చిరంజీవి పుట్టిన రోజు అయినా ఆగస్టు 22న హైదరాబాదులో లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటూ విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు.

కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వరంగల్ కి చెందిన లోహిత రెడ్డి. 2010లో నిట్ వరంగల్ లో లోహిత రెడ్డిని కార్తికేయ కలిశాడట. ఇద్దరూ కలిసి అక్కడే చదువుకున్నారు. అని సమాచారం. పది సంవత్సరాలుగా ఉన్న ప్రేమను పెళ్లి గా మార్చుకున్నాడు కార్తికేయ. తనని పూర్తిగా అర్థం చేసుకున్న ప్రాణ స్నేహితురాలు భార్యగా రావడం తన అదృష్టం అని అంటున్నాడు కార్తికేయ.