అన్నా చెల్లెళ్లుగా నటించిన టాలీవుడ్ హీరో,హీరోయిన్ లు వీరే…ఒక లుక్ వేయండి

Tollywood heros and their onscreen sisters :స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత గానీ హీరోకి చెల్లెలిగానో,అక్కగానో నటించిన వాళ్ళు చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా కలియుగ పాండవులు మూవీతో విక్టరీ వెంకటేష్ తో జోడీ కడుతూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కుష్బూ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తమిళనాట ఈమెకు గుడి కూడా కట్టారు. అయితే ఈమె స్టాలిన్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి అక్క పాత్రలో నటించి మెప్పించింది.

అంతెందుకు మహానటి మూవీతో టాప్ హీరోయిన్ గా మారిపోయిన కెరేతీసుయేశ్ ఓ పక్క హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ మూవీలో చెల్లెలుగా నటిస్తోంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నవరం మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెల్లి పాత్రలో సంధ్య నటించింది. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి రెడ్డి ఆ మధ్య అర్జున్ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క పాత్రలో అదరగొట్టింది. హీరోయిన్ గా రాణిస్తున్న నిత్యా మీనన్ సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో ఉపేంద్రకు చెల్లెలుగా నటించింది. అలాగే హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే గోరింటాకు మూవీలో డాక్టర్ రాజశేఖర్ చెల్లెలి పాత్రలో మీరా జాస్మిన్ నటించింది.

బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ అక్కగా కృతి కర్బందా నటించింది. సుస్వాగతం మూవీలో హీరోయిన్ గా చేసిన దేవయాని, చెన్నకేశవరెడ్డి మూవీలో బాలయ్యకు చెల్లెలిగా నటించింది. మోసగాళ్లు మూవీలో హీరో మంచు విష్ణుకి చెల్లిగా కాజల్ అగర్వాల్ నటించింది. హీరో నితిన్ కి ఇష్క్ మూవీలో సింధు తులాని చెల్లెలుగా నటించింది. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో హీరో శ్రీహరి చెల్లెలి పాత్రలో త్రిష నటించింది. నాగచైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేసావే మూవీలో సమంతకు అన్న పాత్రలో సుధీర్ బాబు నటించాడు. మసాలా మూవీలో హీరో రామ్ కి అక్కగా హీరోయిన్ అంజలి నటించింది.