MoviesTollywood news in telugu

సీరియల్ నటి రాగిణి గురించి ఈ విషయాలు మీకు తెలుసా…అసలు నమ్మలేరు

chellelli kapuram serial Ragini : ఒకనాటి నటీమణి,నిర్మాత కృష్ణవేణి సోదరి రాగిణి ఇటు సినిమా రంగంలో అటు టివి రంగంలో రాణిస్తోంది. మొదట్లో ఆర్ధిక కష్టాలను చవిచూసిన రాగిణి క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఇబ్బందులు మాత్రం ఎదుర్కోలేదట. అయితే టివి నటులంటే సినిమా రంగంలో తక్కువ రెమ్యునరేషన్ ఇస్తూ, చిన్నచూపు చూస్తుంటారని రాగిణి చెప్పేమాట.

అయితే కొందరు నటులు ఇలాంటి ముద్ర చెరిపేశారని రాగిణి ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆర్ధిక కారణాల వలన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయిన రాగిణి తొలుత సాఫ్ట్ రోల్స్ లో నటించినప్పటికీ ఇపుడు కామెడీ అంశాలున్న పాత్రలతో రాణిస్తోంది. వేమన సీరియల్ తో టివి నటిగా ఎంట్రీ ఇచ్చిన రాగిణి దాదాపు 550సీరియల్స్ లో నటించింది. 190కి పైగా సినిమాల్లో నటించింది.

దూరదర్శన్ సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చి.. సుమారు 550 పైగా సీరియల్స్‌లో, 190 పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు. అమృతం, మై నేమ్ ఈజ్ మంగతాయారు, శశిరేఖా పరిణయం, అగ్నిసాక్షి, నాన్న, మా కోడలు బంగారం చాలా సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా సీరియల్స్ లేడీ విలన్‌గా అద్భుత నటనను ప్రదర్శిస్తున్నారు రాగిణి.

అమృతం సీరియల్ లో శాంత పాత్రలో మెప్పించిన రాగిణి, ఎండమావులు వంటి సీరియల్స్ తో పాటు జులాయి,భలే భలే మగాడివోయ్ వంటి హిట్ మూవీస్ లో కూడా నటించింది. ఏ రంగమైనా సరే, మన ప్రవర్తనను బట్టి అవతలి వాళ్ళ ప్రవర్తన ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.