MoviesTollywood news in telugu

తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన సుమన్…ఏమిటో తెలుసా?

Tollywood hero suman :కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన తరంగిణి మూవీతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న సుమన్ అప్పట్లో అగ్ర హీరోలకు దడ పుట్టించాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్న సుమన్ తన అభినయంతో, ఫైట్స్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

స్వర్గీయ టి కృష్ణ డైరెక్ట్ చేసిన నేటి భరతం, దేశంలో దొంగలు పడ్డారు వంటి హిట్ మూవీస్ తో దూసుకుపోతున్న సుమన్ కెరీర్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఒక కేసులో ఇరుక్కోవడంతో జైలుకి వెళ్లడం, తర్వాత రిలీజ్ కావడం జరిగింది. అయితే అప్పట్లో సుమన్ దూకుడు తట్టుకోలేక చిరంజీవి, బాలకృష్ణ కావాలనే సుమన్ ని కేసులో ఇరికించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని స్వయంగా సుమన్ ఎన్నోసార్లు వివరణ కూడా ఇచ్చాడు. హీరోగా దెబ్బతిన్నప్పటికీ క్యారెక్టర్ యాక్టర్ గా మారిన సుమన్ భక్తి సినిమాల తో తన సత్తా చాటాడు. అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, శ్రీ రామదాసులో శ్రీరాముడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు శివాజీ లాంటి సినిమాల్లో నెగెటివ్ కేరక్టర్స్ కూడా పండించాడు. క్యారెక్టర్ యాక్టర్ గా ఫాన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."