వివాహ భోజనంబు సినిమా షూటింగ్ ఎక్కడ చేశారో తెలుసా ?

Vivaha Bhojanambu Movie : గతంలో వివాహ భోజనంబు కామెడీ మూవీ రిలీజ్ కాగా,ఇప్పుడు సందీప్ కిషన్ నిర్మాణ సారధ్యంలో అదే టైటిల్ తో సినిమా తెరకెక్కించారు. కమెడియన్ సత్య ఇందులో హీరో పాత్ర చేయడం విశేషం. ఈ సినిమాకు చాలా తక్కువ బడ్జెట్ పెట్టారట.

ఎందుకంటే ఒకే ఇంట్లో సినిమా షూటింగ్ మొత్తం క్లోజ్ చేశారట. వెయ్యి అబద్ధాలు ఆడి అయినా సరే, ఒక పెళ్లి చేయాలన్న కాన్సప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఎందుకంటే పిసినారి మహేష్ పాత్రలో సత్య నటించి,హీరోయిన్ కుటుంబాన్ని మొదటి నుంచీ మోసం చేస్తూ ఉంటాడు.

ఆవిధంగా హీరోయిన్ ని పెళ్లిచేసుకుంటాడు సత్య. ఇందులో సందీప్ కిషన్ కీలక పాత్రలో గెస్ట్ గా కన్పిస్తాడు. కరోనా,లాక్ డౌన్ అంశాలను కూడా జోడించి హాస్య భరితంగా సినిమా తెరకెక్కించారు. స్వామి రారా మూవీతో కమెడియన్ గా గుర్తింపు పొందిన సత్య తక్కువ సమయంలో హీరో పాత్రలో చేయడం విశేషం.

ఒకే ఇంటిలో షూటింగ్ చేసి చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. ఒకే ఇంటిలో షూటింగ్ చేయటం వలన కొంచెం నెగిటివ్ అంశం అయినా తక్కువ బడ్జెట్ కావటంతో మంచి లాభాలను తెచ్చి పెట్టింది.