MoviesTollywood news in telugu

కృష్ణ వంశీ కెరీర్ లో టాప్ 10 సినిమాలు ఇవే…మీరు చూసారా…?

Director Krishna Vamsi Top 10 Movies :క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా సినిమాలు డైరెక్ట్ చేసారు. అందులో చాలావరకూ సూపర్ హిట్ కొట్టాయి. అయితే అందులో టాప్ టెన్ గా ఎంచుకుని చూస్తే, మొదటి మూవీ గులాబితోనే సత్తా చాటాడు. జెడి చక్రవర్తి, మహేశ్వరీ జంటగా నటించిన ఈ మూవీలో సింగర్ సునీత పాడిన ఈవేళలో సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది.

ఇక ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన తొలిచిత్రంగా ఇండస్ట్రీలో నిల్చిన అంతః పురం మూవీ కృష్ణ వంశి క్రియేటివిటీకి నిదర్శనం. ఇళయరాజా సంగీతంలో అసలేం గుర్తుకురాదు సాంగ్ బ్లాక్ బస్టర్. సాయికుమార్,సౌందర్య,ప్రకాష్ రాజ్,జగపతి బాబు తదితరులు నటించిన ఈ మూవీ సెన్షేషన్ హిట్ అయింది. 1998లో రిలీజయింది.

2002లో దేశభక్తి నేపథ్యంలో తీసిన ఖడ్గం మూవీ ఎప్పటికీ చూడతగ్గ సినిమాగానే ఉంటుంది. శ్రీకాంత్,రవితేజ,ప్రకాష్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ కి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నంది అవార్డు వచ్చింది.

ఇక యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. నాగార్జున, టబు జంటగా నటించిన ఈ సినిమాలో నాగ్ ని మన్మథుడిగా అభివర్ణించేలా ఉంటుంది. 1996లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టి, లాభాలు ఆర్జించి పెట్టింది.

మహేష్ బాబు,సోనాలి బింద్రే జంటగా నటించిన మురారి మూవీ కృష్ణ వంశి దర్శక ప్రతిభకు నిదర్శనం. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలింగా నంది అవార్డు అందుకుంది.

సినిమా కథ,కధనం అద్భుతంగా నడిపిస్తూ కృష్ణవంశీ తీసిన శ్రీ ఆంజనేయం మూవీలో సీనియర్ హీరో అర్జున్, యంగ్ హీరో నితిన్ నటించారు. 2004లో రిలీజయింది.

ఓ అందమైన కుటుంబాన్ని చూపిస్తూ తీసిన చందమామ మూవీ కూడా హిట్. కాజల్,నవదీప్,శివబాలాజీ తదితరులు నటించిన ఈ మూవీలో కామెడీ,ఎమోషన్ బాగా పండాయి.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన రాఖీ మూవీ అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ తో అద్భుతంగా కృష్ణవంశీ తెరకెక్కించారు. 2006లో వచ్చిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలరించింది.

ఓ చెడ్డవాణ్ణి సైతం అహింసా మార్గానికి అనువుగా మారుస్తూ తీసిన మహాత్మా మూవీ సెన్షేషన్ హిట్. శ్రీకాంత్ 100వ సినిమాగా వచ్చిన ఈ మూవీ 2009లో వచ్చింది.

రామ్ చరణ్, కాజల్ జంటగా వచ్చిన గోవిందుడు అందరివాడేలే మూవీ కృష్ణవంశీ డైరెక్షన్ తీరుకి మరో నిదర్శనం. 2014లో వచ్చిన ఈ మూవీ 40కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.