MoviesTollywood news in telugu

రెండు అంతకన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్న స్టార్స్…ఎంత మందో…?

Tollywood Heroes Movies :గతంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేసే హీరోలు ఉండేవారు. ఇంకా ఎక్కువ సినిమాలు కూడా చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒక ఏడాది ఏకంగా 12మూవీస్ చేసారు. కానీ ఇప్పటి అగ్ర హీరోలు ఏడాదికి ఒక సినిమా కూడా చెయ్యట్లేదు. ఫాన్స్ వెయిట్ చేయాల్సి వస్తోంది. పైగా కరోనా నేపథ్యంలో సినిమాలు బాగా జాప్యం అవుతున్నాయి. ట్రెండ్ మారింది. అయినా సరే, కొందరు హీరోల చేతిలో రెండు అంతకన్నా ఎక్కువ సినిమాలు ఉండడం విశేషం. కరోనా సమయంలో కూడా కొందరు హీరోలకు చేతినిండా పని ఉంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో కమిట్ అవ్వడంతో బిజీ అయ్యారు. హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ మూవీస్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ తో సహా ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఆచార్య పూర్తి చేయగా రిలీజ్ కావాల్సి ఉంది. గాడ్ ఫాదర్ సినిమాతో పాటు భోళా శంకర్, డైరెక్టర్ బాబీ మూవీస్ ఉన్నాయి.

ప్రభాస్ అయితే రాధే శ్యామ్ పూర్తికాగా,సలార్ ,ఆదిపురుష్ మూవీస్ తో పాటు 2022లో నాగ అశ్విన్ డైరెక్షన్ లో మూవీ ఉంది. విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప ఓటిటి లో రిలీజ్ కాగా,ఎఫ్ 3,దృశ్యం సీక్వెల్ చేస్తున్నారు.ఎఫ్ 3లో చేస్తున్న వరుణ్ తేజ్ మరోపక్క గని మూవీ చేస్తున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి ఆర్ ఆర్ ఆర్ చేస్తుండగా, గౌతమ్ తిన్నసూరి మూవీ కమిట్ అయ్యాడు.

రవితేజ కూడా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ చేస్తున్నాడు. గోపీచంద్ సిటీమార్,పక్కా కమర్షియల్ మూవీస్ తో పాటు శ్రీవాస్ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడు.నాని టక్ జగదీశ్ ఓటిటిలో రిలీజ్ అవుతుండగా, శ్యాం సింగరాయ్, సుందరానికి మూవీస్ చేస్తున్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ,థాంక్యూ మూవీస్ తో పాటు అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా మూవీ చేస్తున్నాడు.