అతడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Athadu movie child artist : బిగ్ బాస్ నాలుగు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా నడవగా, ఇప్పుడు 5వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో కంటెస్టెంట్స్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 5న ఎవరెవరో తేలిపోనుంది. అయితే అతడు మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా వేసిన కుర్రాడు ఇప్పుడు పెద్దయ్యాడు. సినిమాల్లో కూడా చేసాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమా టివిలో వస్తుంటే రేటింగ్ అదిరిపోతూనే ఉంటుంది. ఇందులోని మహేష్ బాబు నటన, సునీల్ కామెడీ, బ్రహ్మానందం పంచ్ డైలాగులు ఇలా అన్నీ కుదిరాయి.

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా వేసిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ కూడా అందరికీ గుర్తుండే ఉంటాడు. లెజెండ్,ఆర్య,ఆంధ్రుడు,పెదబాబు వంటి సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా కన్పించిన దీపక్ సరోజ్ పెద్దవ్వడంతో మిణుగురులు మూవీతో కీలక పాత్ర పోషించాడు. వందనం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 5వ సీజన్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో.