MoviesTollywood news in telugu

ఎక్కువ వయస్సున్న హీరోయిన్స్ తో నటించిన హీరోలు…ఎంత మంది…?

Tollywood heroes and heroines Age :సినిమాల్లో కొన్ని జంటలు చూడముచ్చటగా ఉంటాయి. హీరోయిన్ వయస్సు ఎక్కువ ఉన్నా సరే, పెద్దగా పట్టించుకోరు. సూపర్ హిట్ జంటగా నిలుస్తారు. అలా తమ కన్నా వయస్సులో పెద్దవాళ్ళతో జోడీ కట్టిన యంగ్ హీరోల విషయానికి వస్తే, ప్రేమదేశం, ఇదీ సంగతి మూవీస్ లో నటించిన అబ్బాస్ , టబు జంట అదిరింది. అయితే అబ్బాస్ కన్నా టబు దాదాపు 6ఏళ్ళు పెద్దది.

వంశీ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు,నమ్రత శిరోద్కర్ కల్సి నటించడమే కాదు, తర్వాత ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. మహేష్ కంటే ఆమె దాదాపు మూడున్నరేళ్లు పెద్దది.

సింహాద్రి మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన భూమిక దాదాపు ఐదేళ్లు పెద్దది. తుపాన్ మూవీలో రామ్ చరణ్ తో నటించిన ప్రియాంక చోప్రా వయస్సు మూడేళ్లు ఎక్కువే.మహానటిలో సమంత కు జోడిగా విజయ్ దేవరకొండ నటించాడు. అయితే విజయ్ కన్నా సమంత రెండేళ్లు పెద్దది.

అల్లుడు శీను మూవీలో సమంత, బెల్లంకొండ శ్రీనివాస్ కల్సి నటించారు. అతడి కన్నా సమంత దాదాపు 6ఏళ్ళు పెద్దది. అలాగే సీత,కవచం మూవీస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. ఈమె వయసు రెండేళ్లు ఎక్కువే.

జయ జానకి నాయక మూవీలో బెల్లంకొండ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు మూడేళ్లు పెద్దది. గుండెల్లో గోదారి మూవీలో మంచు లక్ష్మి , సందీప్ కిషన్ కల్సి నటించగా, అతడి కన్నా ఆమె 10ఏళ్ళు పెద్దది. ఇదే మూవీలో ఆది పినిశెట్టి కూడా నటించాడు. అతడి కన్నా మంచు లక్ష్మి 5ఏళ్ళు పెద్దది.

సంబరం మూవీలో హీరో నితిన్,హీరోయిన్ నిఖిత కల్సి నటించారు. నితిన్ కన్నా నిఖిత రెండేళ్లు పెద్దది. ధైర్యం మూవీలో నితిన్ తో కల్సి నటించిన రీమాసేన్ వయస్సు 4ఏళ్ళు ఎక్కువ. గమ్యంలో శర్వానంద్ సరసన నటించిన కమిలిని ముఖర్జీ నాలుగేళ్లు పెద్దది. హీరో రామ్ ఎంట్రీ ఇచ్చిన దేవదాసు మూవీలో ఇలియానా కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే అతడి కన్నా ఆమె రెండేళ్లు పెద్దది.

అలాగే మసాలా మూవీలో రామ్ తో జోడీ కట్టిన షాజన్ పదంసీ దాదాపు ఒక ఏడాది పెద్దది. రామ్ తో పండగ చేస్కో మూవీలో నటించిన సోనాల్ చౌహన్ కూడా ఏడాది పెద్దదే. రెడీ సినిమాలో జోడీ కట్టిన జెనీలియా కూడా ఏడాది పెద్దదే. ఇక గణేష్ మూవీలో రామ్ తో నటించిన కాజల్ అగర్వాల్ మూడేళ్లు పెద్దది.