ఏ హీరో సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందో తెలుసా?

Tollywood heros movies and their shooting updates :కరోనా కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నట్టే సినిమా రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. అయితే లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకూ ఓటిటి వేదికగా పలు సినిమాలు రిలీజయ్యాయి. సడలింపులు తర్వాత థియేటర్లలో కొన్ని సినిమాలు రిలీజయ్యాయి. అటు ఓటిటి,ఇటు థియేటర్స్ లో సినిమాలు పడుతుండడంతో మరోపక్క షూటింగ్స్ కూడా తగు జాగ్రత్తలతో వేగం పుంజుకున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి,మోహన్ రాజా కాంబినేషన్ లో లూసిఫర్ మూవీ షూటింగ్ విశాఖ పట్నంలో సాగుతోంది. కింగ్ నాగార్జున,మోహన్ కృష్ణ కాంబోలో బంగార్రాజు షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా,అక్కడే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట మూవీ షూటింగ్ జరుగుతోంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ కూడా ఇక్కడే చేస్తున్నారు.

పరశురామ్ దీనికి డైరెక్టర్. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ ముంబైలో షూటింగ్ చేసుకుంటోంది. గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్షన్ లో తీస్తున్న సినిమా షూటింగ్, అలాగే నాగసౌర్య,అనీష్ కృష్ణ కాంబోలో వచ్చే మూవీ షూటింగ్ కూడా హైదరాబాద్ లో నడుస్తోంది. నేచురల్ స్టార్ నాని నటించే అంటే సుందరానికి మూవీ కూడా అక్కడే జరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించే గని మూవీ షూటింగ్ ఢిల్లీలో చేస్తున్నారు.