MoviesTollywood news in telugu

1986 సంవత్సరంలో విడుదల అయిన సినిమాల్లో ఎన్ని హిట్స్…?

1986 hits and flops all telugu movies list :ప్రతియేటా సినిమాలు విడుదలవ్వడం,అందులో కొన్ని హిట్ అవ్వడం, మరికొన్ని ఏవరేజ్, ఇంకొన్ని ప్లాప్ కావడం తెల్సిందే. అయితే 1986లో వచ్చిన మూవీస్ ఒకసారి పరిశీలిస్తే, అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ నటించిన ఆదిదంపతులు మూవీ హిట్ అయింది. ఆలాపన మూవీ నిరాశ పరిచింది.

నందమూరి బాలకృష్ణ నటించిన అనసూయమ్మ గారి అల్లుడు మూవీ సూపర్ హిట్. బాలయ్య డబుల్ రోల్ పోషించిన అపూర్వ సహోదరులు ప్లాప్ గా నిల్చింది. విక్టరీ వెంకటేష్ నటించిన బ్రహ్మరుద్రులు మూవీ హిట్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్రహ్మాస్త్రం సూపర్ హిట్. నాగార్జున నటించిన కెప్టెన్ నాగార్జున ప్లాప్ కాగా, సుమన్ నటించిన చాదస్తపు మొగుడు హిట్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన చాణక్య శపధం, చంటబ్బాయ్, ధైర్యవంతుడు మూవీస్ ప్లాప్ గా నిలిచాయి. బాలయ్య నటించిన దేశోద్ధారకుడు హిట్ అయింది. శోభన్ బాబు నటించిన డ్రైవర్ బాబు ప్లాప్ కాగా, జైలుపక్షి హిట్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన జయం మనదే సూపర్ హిట్ అయింది.

జీవన పోరాటం కూడా హిట్ అయింది. బాలకృష్ణ నటించిన కలియుగ కృష్ణుడు హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన కలియుగ పాండవులు మూవీ సూపర్ హిట్ అయింది. రాజేంద్రప్రసాద్ నటించిన కారుదిద్దిన కాపురం,డాక్టర్ రాజశేఖర్ నటించిన కాష్మోరా హిట్ అయ్యాయి. కృష్ణ నటించిన ఖైదీ రుద్రయ్య బ్లాక్ బస్టర్ కాగా, కృష్ణగారడి ప్లాప్ అయింది. చిరంజీవి నటించిన కిరాతకుడు ప్లాప్ కాగా కొండవీటి రాజా బ్లాక్ బస్టర్ అయింది. మగధీరుడు హిట్ అయింది.

రాజేంద్రప్రసాద్ లేడీస్ టైలర్ బ్లాక్ బస్టర్ అవ్వగా, 16ఏళ్ళ అమ్మాయి ప్లాప్ అయింది. అల్లు అర్జున్ నటించిన మన్నెంలో మొనగాడు హిట్. బాలయ్య నటించిన ముద్దుల క్రిష్నయ్య బ్లాక్ బస్టర్ కాగా నిప్పులాంటి మనిషి ప్లాప్ అయింది. విజయశాంతి నటించిన పడమటి సంధ్యారాగం హిట్ అయింది.

మోహన్ బాబు నటించిన పాపికొండలు ప్లాప్ అయింది. చంద్రమోహన్ నటించిన పవిత్ర ఏవరేజ్ అయింది. కృష్ణ నటించిన ప్రతిభావంతుడు ప్లాప్ అయింది. పుణ్యస్త్రీ మూవీ హిట్ అయింది. చిరంజీవి నటించిన రాక్షసుడు సూపర్ హిట్ అయింది. కృష్ణంరాజు నటించిన రావణ బ్రహ్మ ఏవరేజ్. చంద్ర మోహన్, రాజేంద్రప్రసాద్ ల రెండురెళ్ళు ఆరు హిట్.

విజయశాంతి రేపటి పౌరులు హిట్. శోభన్ బాబు నటించిన సక్కనోడు ఏవరేజ్. కృష్ణ శాంతినివాసం ప్లాప్ కాగా, సింహాసనం హిట్ అయింది. బాలయ్య సీతారామ కళ్యాణం సూపర్ హిట్ అయింది. కళాతపస్వి కె విశ్వనాధ్ తీసిన సిరివెన్నెల హిట్ కాగా,స్వాతిముత్యం సూపర్ హిట్ అయింది. శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం సూపర్ హిట్ అయింది. కృష్ణంరాజు తాండ్రపాపారాయుడు, ఉగ్రనరసింహ ప్లాప్ అయ్యాయి. చిరంజీవి వేట, నాగార్జున విక్రమ్ ప్లాప్ అయ్యాయి.