మణిరత్నం హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?
Tollywood movie geethanjali actress girija : అక్కినేని నాగార్జున కు క్లాస్,మాస్ ఆడియన్స్ లో కూడా పేరు తెచ్చిన చిత్రం గీతాంజలి. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ 1989లో విడుదలై జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇళయరాజా మ్యూజిక్ లో వేటూరి పాటలు అదిరిపోయాయి. ఆల్ టైం క్లాసిక్ గా నిలిచాయి. ముఖ్యంగా మణిరత్నం డైరెక్ట్ చేసిన ఏకైక తెలుగు మూవీ కూడా ఇదే. ఈ మూవీలో నాగ్ సరసన గిరిజ జంటగా నటించింది. అంతేకాదు,గిరిజ కూడా మళ్ళీ తెలుగు సినిమాల్లో ఎక్కడా నటించలేదు.
నిజానికి గీతాంజలి మూవీ హీరో, హీరోయిన్లుగా నాగ్, గిరిజ లిద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. కళ్లతోనే హావభావాలు పలికించి తెలుగు ఆడియన్స్ గుండెలో గీతాంజలిగా చెరగని ముద్ర వేసుకున్న గిరిజ ప్రస్తుతం లండన్‌లో రచయితగా స్థిరపడింది. 2005 నుంచి ఆరోగ్యం సంబంధాలపై జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. ఈమె పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెత్తార్. తన 18వ ఏట భరతనాట్యం నేర్చుకుంది.
క్రికెటర్ శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసినిల పెళ్లికి గిరిజ కూడా వెళ్లడంతో అక్కడ గిరిజను చూసిన మణిరత్నం తన సినిమాలో హీరోయిన్‌గా నటించమని కోరడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం జరిగాయి. ఆవిధంగా గీతాంజలి మూవీలో నటించి తన సత్తా చాటింది గిరిజ. అయితే ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్‌డం తెచ్చుకుంది. అదే సమయంలో మలయాళంలో కొన్ని చిత్రాలు కూడా పూర్తి చేసి, సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది.

