బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ నాగార్జున పారితోషికం ఎంతో తెలుసా?

Bigg Boss 5 Telugu Nagarjuna :మొత్తానికి సెప్టెంబర్ 5 ఆదివారం నాడు బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ మాలో స్టార్ట్ అయింది. గత రెండు సీజన్స్ కి హోస్ట్ గా చేసిన కింగ్ నాగార్జున 5వ సీజన్ కి కూడా హోస్ట్ అయ్యాడు. నిజానికి దగ్గుబాటి రానాతో సహా ఐదారు పేర్లు హోస్ట్ జాబితాలో వినిపించినా చివరకు నాగ్ నే ఫైనల్ చేసారు.

ఇక గతంలో కన్నా భిన్నంగా 19 మంది కంటెస్టెంట్స్ ని తీసుకోవడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరినీ తీసుకునే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. నటి సురేఖావాణి,ఇషా చావ్లా, నవ్య స్వామి పేర్లు వినిపిస్తూ వచ్చినా,సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా .. వాళ్ళ పేర్లు ఇందులో లేకపోవడం విశేషం.

కాగా బిగ్ బాస్ లో హోస్ట్ చేయడం వలన సినిమాల కన్నా ఎక్కువ పారితోషికం నాగ్ కి అందుతోందని టాక్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి నాగ్ హోస్ట్ గా చేసినందుకు 4కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా, ఇప్పుడు రెట్టింపు కన్నా ఎక్కువే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 9 కోట్ల రూపాయలను ముట్టజెపుతున్నట్లు టాక్.