గోపీచంద్ ‘సిటీ మార్’ సినిమా రివ్యూ…హిట్టా…ఫట్టా…?
seetimaarr Movie review In Telugu : సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్,తమన్నా హీరో హీరోయిన్లుగా సిటీ మార్ సినిమా ఈరోజు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాలు ప్లాప్స్ అవుతున్నాయి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు గోపిచంద్. ఆ అంచనాలను అందుకున్నాడు.
కథ విషయానికి వస్తే కార్తీక్ సుబ్రహ్మణ్యం (గోపీచంద్) ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా వస్తాడు. అయితే అమ్మాయిలు .కబడ్డీ ఆడడానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారిని ఒప్పించడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు మరోవైపు తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి (తమన్నా)తో ప్రేమలో పడతాడు.
నేషనల్ కబడ్డీ పోటీలకు ఈ రెండు జట్లు పోటీ పడుతూ ఉంటాయి ఈ క్రమంలో కార్తీక్ ,జ్వాలా రెడ్డి ఇద్దరిని బెదిరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నేషనల్ కబడ్డీ పోటీలో కార్తీక్ టీం గెలుస్తుందా లేదా అనేదే ఈ సినిమా కథ అలాగే కార్తీక్ ప్లాష్ బ్యాక్ అనేది కూడా కీలకమే.
చాలా రోజుల తర్వాత గోపీచంద్ నుంచి మంచి ఎంటర్టైనింగ్ సినిమా వచ్చింది ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమన్నా ఈ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు గోపీచంద్ తమన్నా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక మధ్యలో వచ్చే పాటలు కూడా సినిమాకు మైనస్ కాకుండా ఉండటం విశేషం.
గోపీచంద్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చాలా ఎమోషనల్ గా చూపించారు. సినిమాపై ఆసక్తి తగ్గకుండా చాలా బాగా చిత్రీకరణ చేయడంలో సంపత్ నంది సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది మాస్ అంశాలే కాకుండా స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథను ఎంచుకుని సక్సెస్ కొట్టాడు గోపీచంద్.