జెంటిల్ మెన్ సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో…?

Gentleman movie : శంకర్ డైరక్షన్ లో వచ్చిన జెంటిల్ మెన్ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. తమిళ్ వెర్షన్ లో వచ్చిన ఈ మూవీ తెలుగులో రిలీజై అద్భుత విజయాన్ని అందుకుంది. సినిమా విభిన్నంగా ఉండడంతో తెలుగు ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది,. యాక్షన్ హీరో అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో చరణ్ రాజ్ పోలీసాఫీసర్ పాత్ర చేసాడు.

మధుబాల హీరోయిన్ గా గ్లామర్ తో అదరగొట్టింది. ఇక అర్జున్ దొంగగా నటించిన ఈ మూవీలో అర్జున్,చరణ్ రాజ్ ల మధ్య జరిగే ఎత్తుకు పై ఎత్తులు రసవత్తరంగా ఉంటాయి. తమిళ్,తెలుగు భాషల్లో హిట్ కొట్టిన ఈ మూవీని బాలీవుడ్ లో చిరంజీవి హీరోగా రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. ఇంతలా హిట్ అయిన జెంటిల్ మెన్ సినిమాను డాక్టర్ రాజశేఖర్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ శంకర్ కథ సిద్ధం చేసాడు.

అంతేకాదు, పది లక్షలు చేతిలో పట్టుకుని డాక్టర్ రాజశేఖర్ ని సంప్రదించాడు. అప్పటికే ఆహుతి, అంకుశం వంటి హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న రాజశేఖర్ కరెక్ట్ గా ఈ సినిమాకు సూటవుతాడని భావించాడు. అయితే అప్పటికే దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో అల్లరి ప్రియుడు మూవీకి డేట్స్ ఇచ్చేయడం వలన జెంటిల్ మెన్ వదులుకోవాల్సి వచ్చింది. లేకుంటే సీన్ మరోలా ఉండేది.