సంక్రాంతి మూవీలో శ్రీకాంత్ పాత్రకు ముందుగా ఆ స్టార్ హీరో…?

Sankranti Movie :విక్టరీ వెంకటేష్,స్నేహ జంటగా నటించిన సంక్రాంతి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మలయాళంలో ముమ్ముట్టి హీరోగా వచ్చిన ఆనందం అనే మూవీని తెలుగులో సంక్రాంతిగా రిమేక్ చేసారు. ముప్పలనేని శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వెంకటేష్ తమ్ముళ్లు గా శ్రీకాంత్,శివబాలాజీ, శర్వానంద్ నటించారు. శారద తల్లి పాత్రలో అదరగొట్టారు.

ఈ మూవీలో వెంకటేష్ తర్వాత శ్రీకాంత్ పాత్ర కీలకం. ఈ పాత్రలో శ్రీకాంత్ ఒదిగిపోయాడు. అయితే ఈ పాత్రకోసం ముందుగా మరొకరిని అనుకున్నారట. స్క్రిప్ట్ దశలో ఉండగా వడ్డే నవీన్ ని ఈ పాత్ర కోసం తీసుకోవాలని భావించారట. అయితే శ్రీకాంత్ అయితే బాగుంటుందని నిర్మాత ఆర్బీ చౌదరి చెప్పడంతో శ్రీకాంత్ ని కాంటాక్ట్ చేసినట్లు డైరెక్టర్ ముప్పలనేని శివ ఓ ఇంటర్యూలో చెప్పాడు.

అయితే రాధా గోపాళం మూవీ బాపు డైరెక్షన్ లో శ్రీకాంత్ చేస్తున్నాడు. అందులో స్నేహ హీరోయిన్. సంక్రాంతి లో స్నేహ వదినగా కన్పిస్తుంది. దాంతో ఈ పాత్ర జనం రిసీవ్ చేసుకోరేమోనని భావించి శ్రీకాంత్ ఈ పాత్ర చేయడానికి సంకోచించాడు. అయితే ముప్పలనేని శివ సర్దిచెప్పడం, నిర్మాత ఒత్తిడి పెంచారు. ఇక శ్రీకాంత్ తాజ్ మహల్, గిల్లికజ్జాలు వంటి సినిమాలకు ముప్పలనేని శివ డైరెక్టర్ కావడం, అవి మంచి పేరు తేవడంతో సంక్రాంతి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.