MoviesTollywood news in telugu

అలనాటి హీరోయిన్ ముచ్చర్ల అరుణ కూతుళ్ళు ఏమి చేస్తున్నారో తెలుసా?

Muccherla aruna daughters : అలనాటి స్టార్స్ లో అందం,అభినయం పుష్కలంగా ఉన్న నటులు చాలామంది ఉన్నారు. అందులో సీతాకోక చిలుక మూవీ హీరోయిన్ ముచ్చర్ల అరుణ ఒకరు. భారతీరాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు రచయిత జంధ్యాల. కార్తీక్ హీరో. ఏడిద నాగేశ్వర రావు నిర్మించారు. అనూహ్య విజయం సాధించిన ఈ మూవీ లోని సాంగ్స్ అన్నీ సూపర్. ఈ మూవీలో స్టార్ కమెడియన్ అలీ చైల్డ్ ఆర్టిస్టుగా అదరగొట్టేసాడు.

ఇందులో హీరోయిన్ గా చేసిన అరుణ పలు సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 36 సినిమాలు, తమిళంలో 24,కన్నడలో 3, మాలయంలో 14 సినిమాలు చేసింది. 1990 వరకూ సినిమాల్లో నటించిన ఈమె మోహన్ అనే వ్యక్తిని పెళ్ళిచేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈమెకు నలుగురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. ఇంకా ఇద్దరు అమెరికాలో స్టడీస్ లో ఉన్నారు. ఫ్యామిలీతో సరదాగా ఉంటున్న ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు అప్ లోడ్ చేస్తుంటారు.

సీతాకోక చిలుక సినిమా వచ్చి 40 ఏళ్ళు అయిన సందర్బంగా ఇటీవల అలీతో సరాదాగా ప్రోగ్రాం లో ముచ్చర్ల అరుణ పాల్గొని పలు విషయాలు వెల్లడించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 1963 సెప్టెంబర్ 13న జన్మించిన అరుణ స్టడీస్ హైదరాబాద్ లో సాగింది. చదువుతో పాటు డాన్స్, సంగీతం నేర్చుకుంది. ఈమెకు ఓ సోదరుడు,ఓ సోదరి ఉన్నారు. స్టడీస్ సమయంలోనే భారతీరాజా ఈమెను చూసి సీతాకోక చిలుక హీరోయిన్ గా సెలక్ట్ చేసారు.