బిగ్ బాస్ కంటెస్టెంట్ శైలజా ప్రియ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల ఆస్తి…?

Bigg Boss 5 telugu Sailaja Priya :కింగ్ నాగార్జున హోస్ట్ గా నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 5లో 7వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నటి శైలజా ప్రియ.సినిమాలు,సీరియల్స్ లో నటించిన ఈమె అసలుపేరు మామిళ్ళ శైలజా ప్రియ. అందరూ ప్రియా అని, ఇంట్లో శైలు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్లలో మామిళ్ళ వెంకటేశ్వరావు, కుసుమకుమారి దంపతులకు 1978 మే 20న జన్మించిన ఈమెకు 43ఏళ్ళు. 2002లో ఎంవి కిషోర్ తో పెళ్లయింది. వీరికి నిశ్చయ్ అనే ఒక బాబు ఉన్నాడు.

బాపట్ల శ్రీ వెంకటేశ్వర స్కూల్ లో చదివి, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో స్టడీస్ పూర్తిచేసింది. యాక్టింగ్ పై మక్కువతో దొంగాట మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే చిరంజీవి నటించిన మాస్టర్ మూవీతో మంచి గుర్తింపు లభించింది. గోకులంలో సీత, జయం మనదేరా, ఢమరుకం,మిర్చి,ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి,పండగ చేస్కో,హైపర్, శ్రీనివాస కళ్యాణం, ఉప్పెన ఇలా దాదాపు 100కి పైగా మూవీస్ లో నటించింది.

జెమినిలో ప్రియ శక్తి సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ప్రియా నిను చూడలేక, ప్రియా ఓ ప్రియా, లేడీ డిటెక్టివ్, పెళ్లిచేసుకుందాం, చిన్నకోడలు,శశిరేఖా పరిణయం,నెంబర్ వన్ కోడలు ఇలా పలు సీరియల్స్ లో నటించింది. మొదటిసారి మూవీకి 25వేలు అందుకుంది. ఇప్పుడైతే 5లక్షలకు పైనే తీసుకుంటోంది.

ఇక సీరియల్ కి వారానికి 2 లక్షల వరకూ తీసుకుంటుంది. ఈమెకు చిరంజీవి, సమంత అంటే ఇష్టం. 16కోట్ల నెట్ వర్త్ ఉంటుంది. హైదరాబాద్ గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ లో రెండున్నర కోట్ల విలువ చేసే ప్లాట్ లో ఉంటోంది. ఈమె దగ్గర రెండు కార్లు ఉన్నాయి.