MoviesTollywood news in telugu

అన్నమయ్య సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Nagarjuna Annamayya Movie :అప్పటివరకూ మాస్ హీరోగా రాణిస్తున్న నాగార్జున హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అన్నమయ్య సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. భక్తిరస చిత్రంగా జనంలో మంచి పాపులార్టీ తెచ్చుకుంది. కీరవాణి అందించిన అన్నమయ్య సాంగ్స్ సూపర్భ్. నాగార్జున అన్నమయ్యగా, సుమన్ శ్రీవెంకటేశ్వర స్వామిగా జీవించారు.

మోహన్ బాబు మరో కీలక పాత్రలో మెప్పించారు. 42 సెంటర్స్ లో 100 డేస్,2 సెంటర్స్ లో 175డేస్ ఆడింది.1997మే 22న నిర్మాతలకు 10కోట్ల షేర్ అందించిన ఈ మూవీ నాగార్జునకు నంది అవార్డు తెచ్చింది.ఈ సినిమాకు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమిచుకుందాం రా మూవీ పోటీగా వచ్చింది.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, లవ్ సెంటిమెంట్ తో అన్నమయ్యకు రెండు వారాల ముందు వచ్చింది. జయంత్ సి పరాన్జీ డైరెక్టర్. వెంకటేష్, అంజలా జవేరి జంట అలరించింది. ఈ మూవీ 50సెంటర్స్ కి పైగా 100డేస్ ఆడి, బ్లాక్ బస్టర్ అయింది.

జగపతి బాబు, ఇంద్రజ కల్సి నటించిన ఒక చిన్నమాట మూవీ అన్నమయ్యకు 5రోజుల తర్వాత వచ్చింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్. పెద్ద సినిమాల ముందు ఎబో ఏవరేజ్ అయింది.

అన్నమయ్యకు 8రోజుల తర్వాత డాక్టర్ రాజశేఖర్, సౌందర్య నటించిన మా ఆయన బంగారం మూవీ వచ్చింది. ఏ మోహన్ గాంధీ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్. ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది. అన్నమయ్యకు మూడు వారల ముందు శ్రీకాంత్ , రమ్యకృష్ణ జంటగా ఆహ్వానం మూవీ వచ్చింది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో సాంగ్స్ అలరించాయి. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.