MoviesTollywood news in telugu

శోభన్ బాబు జీవితంలో ఎన్ని ఇబ్బందులను పడ్డారో తెలుసా?

Tollywood hero Sobhan Babu Real Life Struggles :అందాల నటుడు శోభన్ బాబు తన నటనతో ఆడియన్స్ ని ముఖ్యంగా మహిళా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నారు. నటభూషణ్ శోభన్ బాబు ముక్కుసూటిగా వ్యవహరించేవారు. ఎదుటి వారి అభిమానులను కూడా తన అభిమానులుగా మార్చుకున్న మనసున్న మనిషి ఈయన.

ఎన్టీఆర్,అక్కినేని హీరోలుగా వెలుగొందుతున్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన శోభన్ బాబు ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. ఒడిడుకులు ఎదుర్కొన్నారు. అయినా వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నెలకు 250 రూపాయలతో నెట్టుకొచ్చినట్లు ఓ ఇంటర్యూలోనే చెప్పారు.

పెళ్లయి, నలుగురు పిల్లలు ఉన్న సమయంలో నెలకు రెండువేలతో నెట్టుకు రావాల్సి వచ్చేదట. అదనంగా 50 రూపాయల ఖర్చు కోసం చిన్న చిన్న వేషాలు కూడా వేశారు. అయితే పలు వ్యాపారాలు,ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా బాగా సంపాదించి స్థితిమంతుడు అయ్యారు