బిగ్ బాస్ ఉమాదేవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా…ఏమి చేసిందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

Bigg Boss 5 Telugu Uma devi remuneration : స్టార్ మాలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 మాదిరిగానే సీజన్ 5 లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్‌లో ఒకరిద్దరు మినహా మిగిలినవాళ్లు జనాలకు అంతగా తెలియని వల్లే ఉన్నారు. కార్తీక దీపం ఫేమ్ అర్ధపావు భాగ్యంగా నటించిన ఉమా దేవి వంటి కొద్దీ మంది మాత్రమే ఆడియన్స్ కి పరిచయం ఉన్నారు. అయితే ఈమె వ్యవహార శైలితో తొందరగా ఎలిమినేట్ అయింది.

అయితే రెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన ఉమాదేవి ఎంత ఎమ్యూనరేషన్ తీసుకుందన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్‌కు భారీగానే చెల్లిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. దాంతో రెండు వారాలకు ఉమాదేవికి సుమారు ఒక లక్షా అరవై వేల రూపాయల పారితోషికం అందుకుందని అంటున్నారు.

ఉమాదేవి పలు సినిమాల్లో సీరియల్స్‌లో నటించి ఆకట్టుకోవడంతో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి తన దైన ఆట తీరు కనబరిచింది.కానీ టాస్క్‌ల సమయంలో వ్యవహరించిన తీరు, ముక్కు సూటిగా మాట్లాడటం, ప్రతి చిన్న విషయానికి కూడా గొడవకు దిగడం వంటి కారణాలతో హౌస్ లో సీన్ రివర్స్ అయింది. పైగా బూతులు మాట్లాడటం ఆమెకు మైనస్ అయ్యింది. దాంతో రెండు వారాలకే హౌస్ నుంచి ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది.

అయితే ఉమాదేవికి చేసిన ఒకపనికి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఆమెకు బిగ్ బాస్ లో వచ్చిన పారితోషికంలో కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక చిన్నారికి అందించింది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఉమాదేవికి హ్యాట్సాఫ్ చెప్పుతున్నారు.