సినిమాల్లో నటులుగా సత్తా చాటుతున్న స్టార్ డైరెక్టర్స్

Tollywood Directors cum actors : చాలా సినిమాలు డైరెక్ట్ చేసినవాళ్లు ఇక డైరెక్షన్ గుడ్ బై చెప్పేసి నటులుగా నటిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే డైరెక్ట్ చేస్తూ సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో నటించి ఆకుట్టుకున్నవాళ్ళు ఉన్నారు. ఇందులో మొదటి కేటగిరీలో చూస్తే, శంకరాభరణం,స్వాతిముత్యం,స్వయంకృషి,స్వర్ణ కమలం ఇలా ఎన్నో కళాత్మక చిత్రాలు తీసిన కళాతపస్వి కె విశ్వనాధ్ తరువాత చాలా సినిమాల్లో నటుడిగా నటించి మెప్పించారు.

అలాగే దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఎన్నో హిట్ మూవీస్ కి డైరెక్టర్ గా చేసి, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి ఆకట్టుకున్నారు. గతంలో ఎమ్మెల్యే ఏడుకొండలు, పిచ్చోడి చేతిలో రాయి వంటి సినిమాల్లో ఆయనే హీరో. ఒసేయ్ రాములమ్మ,మామగారు ఇలా చాలా సినిమాల్లో నటుడిగా సత్తా చాటారు.

దాసరి శిష్యుడిగా వంద సినిమాలకు పైగా డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ కూడా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మరోచరిత్ర వంటి మూవీస్ కి డైరెక్షన్ చేసిన స్టార్ డైరెక్టర్ కె బాలచందర్ సైతం ఉత్తమ విలన్ అనే మూవీలో నటించారు. అల్లు అర్జున్ నటించిన వరుడు మూవీలో స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు అలాగే ప్రముఖ డైరెక్టర్ ఏ కోదండ రామిరెడ్డ్డి అడివిదొంగ, శ్రీరంగ నీతులు మూవీస్ లో నటించారు.

మెగాస్టార్ తో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150డైరెక్ట్ చేసిన వివి వినాయక్ ఆ సినిమాల్లో తళుక్కున మెరవగా, తాజాగా పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న బీమ్లా నాయక్ మూవీలో కొన్ని నిముషాలు కనిపించబోతున్నాడు.మహానటి సినిమాలో డైరెక్టర్ కెవి రెడ్డి పాత్రలో డైరెక్టర్ క్రిష్ నటించగా, కోబ్రా మూవీలో రామ్ గోపాల్ వర్మ నటించారు.

డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా, క్యారెక్టర్ యాక్టర్ గా నటించారు. నువ్వులేక నేను లేను వంటి మూవీస్ డైరెక్ట్ చేసిన కాశీవిశ్వనాధ్ నటుడిగా రాణిస్తున్నారు. డైరెక్టర్ సముద్రగని అయితే నెగెటివ్ షేడ్ రోల్స్ లో అదరగొడుతున్నారు. రచయిత,డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి పలు సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా చేస్తున్నారు.

ఇక రచయితలు పరుచూరి బ్రదర్స్ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. డైరెక్టర్స్ పూరి జగన్నాధ్, శేఖర్ కమ్ముల, చంద్ర సిద్దార్ధ్, ఎస్ జె సూర్య, తరుణ్ భాస్కర్, పరమవీర చక్ర మూవీలో బి గోపాల్, శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, వాసు తదితరులు నటించారు.