స్టార్ హీరోయిన్ డాటర్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు జంటగా మూవీ…ఎవరో…?

Vani Viswanath Sister Daughter Varsha :సినిమా రంగంలో వారసత్వానికి కొదవలేదు. హీరోల కొడుకులే కాదు, కూతుళ్లు కూడా నటిస్తున్నట్లే,హీరోయిన్స్ కూతుళ్లు,కొడుకులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే క్యారెక్టర్ యాక్టర్స్,డైరెక్టర్స్,సాంకేతిక నిపుణులు ఇలా అందరి వారసులు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. నటన,టాలెంట్ ఉన్నా సరే, అదృష్టాన్ని బట్టి ఫీల్డ్ లో నిలబడుతున్నారు.

తాజాగా ఇండస్ట్రీలో ఓ అరుదైన జంట ఎంట్రీ ఇస్తోందని వార్త లొస్తున్నాయి. ఒకప్పుడు మెలోడీ సంగీతానికి సాలూరి రాజేశ్వరరావు పెట్టింది పేరు. అయన తనయుడు కోటి కూడా ఎంట్రీ ఇచ్చి మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించాడు. అయితే ఇప్పుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా ప్రొడక్షన్ నెంబర్ వన్ పేరిట ఒక సినిమా ఇప్పటికే వైజాగ్ లో షూటింగ్ స్టార్ట్ అయింది.

ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. కిట్టూ నల్లూరి డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర,రాజా,సదన్,లావణ్య తదితరులు నటిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాధ్ సోదరి ప్రియావిశ్వనాథ్‌ కూతురు వర్ష విశ్వనాధ్ నటిస్తోంది. ఘరానామొగుడు వంటి హిట్ మూవీస్ లో వాణీ విశ్వనాధ్ తన నటనతో మెప్పించింది. ఇక కోటి కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు.