ఎస్వీఆర్ విషయంలో అంజలీదేవి ఏంచేసిందో తెలుసా…అసలు నమ్మలేరు

Tollywood Heroine Anjali Devi And Svr :సినిమా స్టార్ కావాలని చాలామంది అప్పట్లో మద్రాసు వెళ్లి తిండి తిప్పలు లేక స్టూడియోల చుట్టూ తిరిగేవారని చెబుతారు. అదృష్టం తలుపు తట్టినవాళ్లు యాక్టర్స్ గా మారితే ,కొందరు వెనుదిరిగి వెళ్ళిపోయిన వాళ్ళూ ఉన్నారు. అలా వెనక్కి వెళ్లి పోవాలనుకుని నట యశస్వి గా మారిన నటుడే ఎస్వీ రంగారావు. నాటకాల్లో వేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈయన నటుడవ్వాలని మద్రాసు వెళ్లారు. వెళ్లిన వెంటనే ఛాన్స్ లు రావు కదా. ఎస్వీఆర్ విషయంలో అదే జరిగింది.

చేతిలో చిల్లిగవ్వలేక,మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. పైగా పడుకోడానికి పేపర్లు గతి అయ్యాయి. అలా నిద్రాహారాలు కరువైన పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న ఎస్వీ ఆర్ వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటున్న సమయంలో అంజలీదేవి చేయూత నిచ్చింది. అప్పటికే సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న అంజలీదేవి కాకినాడలో నాటకాలు వేసేటప్పుడు ఎస్వీఆర్ తో కల్సి చేసింది. ఎస్వీఆర్ పడుతున్న కష్ఠాలు చూసి, మన ఇంటికి ఎస్వీఆర్ ఎప్పుడొచ్చినా భోజనం పెట్టండి అని వంట మనిషి అయ్యర్ కి చెప్పిందట.

అలా ఆయన ఆకలి తీర్చడమే కాకుండా సినిమాల్లో ఛాన్స్ ఇప్పించింది. అలా 1946లో చేసిన వరూధిని మూవీ ప్లాప్ కావడంతో ఎస్వీఆర్ కి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు పెళ్లి కూడా చేసారు. మద్రాసు వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో డీలా పడ్డాడు. అదే సమయంలో పాతాళభైరవి రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆ సినిమా విజయంతో వరుస పెట్టి ఛాన్స్ లు రావడంతో మహానటుడయ్యారు. అవలీలగా డైలాగులు చెప్పడంలో ఎస్వీఆర్ కి సాటిలేరని నిరూపించుకున్నారు.