MoviesTollywood news in telugu

శంకర్ – చెర్రీ కాంబోలో ఫైట్ కి ఖర్చు ఎంతో తెలుసా ?

Ram charan New Movie :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. పొలిటికల్ డ్రామాగా తీయబోయే ఈ సినిమా ఇప్పటీకే ఆర్ సి 15 టైటిల్ వర్కింగ్‍తో తీయడానికి ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత దిల్ రాజు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగనుంది.

గతంలో శంకర్ దర్శకత్వంలో తీసిన బాయ్స్ సినిమాతో సినీమా రాంగానికి ఎంట్రీ ఇచ్చిన తమన్ దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చెర్రీతో తీసే శంకర్ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుండగా, శ్రీకాంత్,సునీల్, అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

అయితే ఈసినిమాలో రన్నింగ్ ట్రైన్ లో సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం 10 కోట్లు వెచ్చిస్తున్నట్లు టాక్. దీంతో ఫాన్స్ లో ఆసక్తి నెలకొంది. కాగా చెర్రీ ఓ పక్క తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ షూటింగ్ నిర్మాణం పూర్తిచేయడమే కాకుండా, మరోపక్క దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సైతం పూర్తి చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించబోతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."