Healthhealth tips in telugu

మన శరీరంలో ఈ పోషకాలు లోపిస్తే ఏమి అవుతుందో తెలుసా?

Nutrition deficiency symptoms in Telugu. మన శరీరంలో పోషకాలు లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని పోషకాలు లోపించిన సరే ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగవు. కానీ కొన్ని లక్షణాలు మాత్రం కనిపిస్తాయి. ఇప్పుడు ఏ పోషకాల కారణంగా ఏ లక్షణాలు కనపడతాయో తెలుసుకుందాం.

అరచేతులు చల్లగా అవుతూ ఉంటె మెగ్నీషియం లోపంగా భావించాలి. అలాగే గుండె బలహీనత, హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా అరచేతులు చల్లగా మారతాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే కాలి పిక్కలు పట్టేయటం మరియు మోకాలు కీళ్లు
పట్టేస్తూ ఉంటాయి. అలాగే గోళ్లు బలహీనంగా ఉండి విరిగిపోతూ ఉంటే కూడా మెగ్నీషియం లోపంగా భావించాలి.

చర్మం మీద చారలు,గోళ్ళ మీద చారలు ఏర్పడితే జింక్ లోపంగా భావించాలి.

చిన్న చిన్న గాయాలకే రక్తస్రావం అవుతూ ఉంటే విటమిన్‌ కె లేదా విటమిన్‌ సి లోపం అని భావించాలి. రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గినా రక్తస్రావం ఎక్కువగా అవుతుంది.

శరీరంలో అయొడిన్‌ లోపం ఉంటే గొంతు వాపు హైపో థైరాయిడిజంకి సూచనగా భావించాలి.

ఐరన్‌ లోపం ఉంటే నాలుక తెల్లగా పాలిపోతుంది.

విటమిన్ B2 తగ్గితే పెదవులు పగులుతాయి.

నాలుక నున్నగా తయారయ్యి నొప్పిగా ఉంటే ఫోలిక్ యాసిడ్ తగ్గిందని అర్ధం చేసుకోవాలి.

నోట్లో నొప్పితో కూడిన ఎర్రటి పుండ్లు ఏర్పడితే విటమిన్ B3 లోపంగా అర్ధం చేసుకోవాలి.

ముఖం మీద, ముక్కు పక్కల ఎర్రగా కంది, తోలు లేస్తుంటే విటమిన్‌ బి2 లోపించిందని తెలుసుకోవాలి. నుదురు మీద, ముక్కు పక్కన‌ నూనెతో కూడిన పొక్కులొస్తుంటే విటమిన్‌ బి6 తగ్గిందని అనుకోవాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."