Movies

జయసుధ హీరోయిన్ అవ్వడానికి కారణం ఎవరంటే…

Tollywood heroine jayasudha :ప్రేమ నగర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన కె ఎస్ ప్రకాశరావు తనయుడిగా టాలీవుడ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రాఘవేంద్రరావు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించి దర్శకేంద్రుడయ్యారు. అయితే మురళీమోహన్ ,జయసుధ జంటగా నటించిన జ్యోతి మూవీ రాఘవేంద్రరావు కెరీర్ తొలినాళ్లలోనే మంచి సినిమాగా నిలిచింది.

జ్యోతి సినిమాకోసం హీరోగా మురళీమోహన్ ని సెలక్ట్ చేసాక , హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. ఎవరూ సూటవ్వడం లేదు. దాంతో మురళీమోహన్ లో టెన్షన్ మొదలైంది. అప్పటికే లక్ష్మణ రేఖ మూవీలో తనతో పాటు నటిస్తున్న జయసుధను హీరోయిన్ గా తీసుకోవాలని మురళీమోహన్ సూచించాడు.

జయసుధకు సంబంధించిన ఆల్బమ్ ని చూసి, డైరెక్టర్ రాఘవేంద్రరావు ఒకే చేసారు. ఆవిధంగా రాఘవేంద్రరావు కి ఆ మూవీతో మంచి పునాది పడింది. డాక్టర్ బాబు మూవీతో డైరెక్టర్ గా మారిన రాఘవేంద్రరావు ఎన్టీఆర్ మొదలుకుని అందరు అగ్రహీరోలతో సినిమాలు చేసారు. అలాగే అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలను హీరోలుగా తెరమీద పరిచయం చేసారు.

అలాగే జయసుధకు కూడా మంచి పేరు వచ్చింది. దాంతో ఆమెకు వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."