నాగశౌర్య లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
Tollywood Hero Naga Shourya :వరుడు కావలెను మూవీతో తాజాగా ఆడియన్స్ ముందుకొచ్చిన హీరో నాగశౌర్య అసలు పేరు ములపూరి నాగశౌర్య. 1989జనవరి 14న ఏలూరులో శంకర్ ప్రసాద్, ఉష దంపతులకు జన్మించిన ఇతడికి 32ఏళ్ళు పూర్తయ్యాయి. శౌర్య, నాని అని నిక్ నేమ్స్ తో పిలుస్తారు. ఇతడికి గౌతమ్ అనే తమ్ముడున్నాడు.
ఏలూరులో స్కూల్ విద్య, హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో బికాం డిగ్రీ పూర్తిచేసాడు. 7వ తరగతి చదువుతున్నప్పుడే హీరో అవ్వాలనే కోరిక కల్గింది. ఇంటర్ లోకి వచ్చాక సినిమా హీరో అవుతానని ఇంట్లో చెప్పాడు. డిగ్రీ పూర్తయ్యేవరకూ సినిమా ఛాన్స్ ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు.
2011సంవత్సరంలో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ మూవీ లో చిన్న రోల్ చేసాడు. 2014లో ఊహలు గుసగుసలాడే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచిపేరు తెచ్చి, హిట్ అయింది. దిక్కులు చూడకు రామయ్య, కల్యాణవైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద, చలో, అమ్మమ్మ గారిల్లు వంటి 20సినిమాల్లో నటించాడు.
కొన్నింటికి అతడే డైరెక్టర్. ఊహలు గుసగుసలాడే మూవీకి 60లక్షల 30వేలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. 2018లో చలో మూవీకి 4కోట్ల 60లక్షలు తీసుకున్నాడు.ఇంకా పెళ్లికాని నాగశౌర్య వరుడు కావలెను మూవీకి 5కోట్లు అందుకున్నాడట. ఇతడి దగ్గర 4సౌకర్యవంతమైన కార్లున్నాయి.
జూబ్లీ హిల్స్ లో 4కోట్ల విలువైన ఇంట్లో ఉంటున్నాడు. న్యూజిలాండ్, పారిస్ ఇష్టమైన ప్రదేశాలు. 6కోట్లు వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ గల ఇంతటి నెట్ వర్త్ 50కోట్లు. ట్రావెలింగ్,బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. నాగార్జున ఇష్టమైన హీరో.