దేవరకొండ బ్రదర్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
star hero vijay devarakonda and anand devarakonda :అతి తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుని గీత గోవిందం సినిమాతో స్టార్ హోదా అందుకున్న విజయ దేవరకొండ ఓ వైపు సినిమాలు, మరోవైపు యాడ్స్ లో బిజీగా ఉన్నాడు. థియేటర్ రంగంలో కూడా అడుగుపెట్టాడు. ఇప్పటికే సొంత ఊర్లో మల్టీ ప్లెక్స్ కట్టాడు.
ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో లైగర్ పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. మరోపక్క అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి మూవీ తో విజయ్ జాతకం మారినట్లే, తనకు కూడా బ్లాక్ బస్టర్ రావాలని ఆనంద్ దేవరకొండ చూస్తున్నాడు.
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు కి చెందిన గోవర్ధనరావు,మాధవి దంపతులకు 1989మే 9న విజయ్ జన్మించగా,1996లో ఆనంద్ జన్మించాడు. విజయ్ తండ్రికి సినిమాలంటే ఇష్టం. అందుకే విజయ్ పుట్టకముందే హైదరాబాద్ వచ్చేసి, ట్రైల్స్ స్టార్ట్ చేసాడు. అయితే దూరదర్శన్ లో సీరియల్స్ కి రైటర్ గా పనిచేసారు. అయితే విజయ్ హైదరాబాద్ లో పలు నాటకాలు వేసి,సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అన్నదమ్ములు ఇద్దరు సినిమాలతో బిజిగానే ఉన్నారు. ఆనంద్ కూడా అన్న వలె సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. ఆనంద్ దేవరకొండ కూడా అభిమానుల మన్ననలను పొందుతూ వెరైటీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
వీరి చదువు అనంతపురంలోని పుటపర్తి లో సాగింది. విజయ్ మొదట్లో చిన్న పాత్రలు వేసి ఆ తర్వాత ఈ స్థాయికి వచ్చాడు. విజయ్ దేవరకొండ మార్కెట్ దాదాపుగా 40 కోట్ల వరకు ఉంటుంది.