MoviesTollywood news in telugu

బుల్లితెర మీద టాప్ TRP రేటింగ్స్ సాధించిన సినిమాలు

Top TRP Telugu Movies :తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని ఎదురుచూసే ఆడియన్స్ సినిమా రిలీజయ్యాక తొలిరోజే చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారు. ఇక సినిమా బాగుంటే ఒకటికి పదిసార్లు సినిమా చూస్తారు. ఇలా వెండితెరమీద సూపర్ హిట్ గా నిల్చి, ఆతర్వాత బుల్లితెరమీద ప్రసారమైతే కూడా టాప్ టీఆర్ఫీ రేటింగ్ సాధిస్తాయి.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా మొదటిసారి ప్రసారమైనపుడు అత్యధికంగా 29.9 టీఆర్పీ సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో మూవీ టివిలో ప్రసరమైతే, 29.4 టీఆర్పీ రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా టివిలో తొలిసారి ప్రసరమైనపుడు 24 టీఆర్పీతో మూడో స్థానం సాధించింది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర మూవీ మొదటిసారిటివిలో ప్రసారమయినపుడు 24 టీఆర్పీతో 3 స్థానం సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా,అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటిసారి టివిలో ప్రసరమైనపుడు 23.4 టీఆర్పీ రేటింగ్‌తో 4వ స్థానంలో నిలిచింది.

వెండితెర మీద రికార్డులను క్రియేట్ చేసిన బాహుబలి 2 మూవీని రాజమౌళి తెరకెక్కించగా, ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ మూవీ తొలిసారి టివిలో ప్రసరమైనపుడు 22.70 టీఆర్పీతో 5వ స్థానంలో నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు మూవీ 22.54 టీఆర్పీ సాధించింది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం డిజె మూవీ 21.7 టీఆర్పీతో 7వ స్థానం సాధించింది. ఇక రాజమౌళి తీసిన బాహుబలి బిగినింగ్ మూవీ 21.54 రేటింగ్‌తో 8వ స్థానం సాధించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్,సాయి పల్లవి నటించిన ఫిదా 21.31 రేటింగ్‌తో 9వ స్థానం,విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం సినిమా 20.8 టీఆర్పీతో 10వ స్థానం సాధించాయి.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన అర‌వింద స‌మేత‌ వీర రాఘవ 20.69 టీఆర్పీ రేటింగ్‌తో 11వ స్థానం;నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన మహానటి 20.2 రేటింగ్‌తో 12వ స్థానం; కొరటాల శివ దర్శకత్వంలో తారక్,మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ 20.69 టీఆర్పీ సాధించి 13వ స్థానం సాధించింది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అను నేను 20.5 రేటింగ్‌తో 14వ స్థానం; త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికీ దారేది 19.84 రేటింగ్‌తో 15వ స్థానం; సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత నటించిన రంగస్థలం మూవీ 19.5 రేటింగ్‌తో 16వ స్థానం; రీసెంట్‌గా టీవీలో మొదటిసారి ప్రసారమైన వకీల్ సాబ్‌ మూవీ 19.12 రేటింగ్‌తో 17వ స్థానంలో నిలిచాయి.