MoviesTollywood news in telugu

స్నేహ యాడ్స్ లో ఎక్కువగా నటించటానికి అసలు కారణం ఇదే…!

Tollywood Heroine Sneha : తొలివలపు మూవీతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స్నేహ శ్రీరామదాసు వంటి సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. ప్రియమైన నీకు, సంక్రాంతి వంటి మూవీస్ లో తన నటనతో ఆకట్టుకుంది. తర్వాత కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా నటుడు ప్రసన్నను పెళ్ళిచేసుకుని గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

పెళ్ళికి ముందు తర్వాత కూడా స్నేహ, ప్రసన్న కల్సి నటించారు. పలు యాడ్స్ లో కూడా కల్సి నటించారు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ వంటి మూవీస్ లో ప్రాధ్యాన్యత గల పాత్రల్లో చేస్తూ, మరోపక్క తమిళ, మలయాళ మూవీస్ లో కూడా స్నేహ చేస్తోంది.

మరోపక్క యాడ్స్ లో కూడా బిజీగా మారింది. ఇంకా చెప్పాలంటే సినిమాల కన్నా యాడ్స్ లోనే ఎక్కువ బిజీ అయింది. యాడ్స్ లో నటిస్తే కంఫర్ట్ గా ఉండడమే కాకుండా వన్ మినిట్ లో అయిపోతుందని స్నేహ చెప్పుకొచ్చింది. అందుకే సినిమా నటీనటులు సినిమాలతో పాటు యాడ్స్ చేస్తూ, పలు ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."