మాటల మాంత్రికుడు మొదటి పారితోషికం ఎంతో తెలుసా ?
Director trivikram srinivas first remuneration : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కుర్రాడు సినిమాల మీద ఇంటరెస్ట్ తో హైదరాబాద్ చేరి, ఎన్నో కష్టాలు పడి మొత్తానికి సినిమా రైటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. రైటర్ కాస్తా డైరెక్టర్ గా అవతారం ఎత్తి అగ్రశ్రేణి డైరెక్టర్ అయ్యాడు. అతడే త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికునిగా వ్యవహారంలోకి వచ్చాడు. మొదట్లో చాలా కష్టపడినప్పటికీ ఇప్పుడు స్టార్ హోదా అందుకున్నాడు
సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది, అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠ పురంలో, జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, నితిన్ తో అ ఆ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం 20 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అయితే తొలిసారిగా అతడు అందుకున్న పారితోషికం గురించి వార్తలు వైరల్ గా మారాయి.
నిజానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రైటర్ గా మొదటి రోజుల్లో కేవలం 2వేల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ అందుకున్నాడు. తర్వాత నుంచి దశ మారింది. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఇతడి మూవీస్ అనువాదమై హిట్ అయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీకి రచయితగా పనిచేసున్న త్రివిక్రమ్ త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కోసం కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు.