MoviesTollywood news in telugu

నెగేటివ్ టాక్ తో హిట్ కొట్టిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

Tollywood negative talk Movies :సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకుని, తర్వాత అనూహ్యంగా పుంజుకుని హిట్ అయిపోతుంటాయి. అలా ప్లాప్ టాక్ తో మొదలై హిట్ సొంతం చేసుకున్న సినిమాల విషయానికి వస్తే, ఆరెంజ్ డిజాస్టర్ కావడంతో రామ్ చరణ్ రచ్చ లాంటి ఔట్ డేటెడ్ కథతో రొటీన్ సినిమా చేసాడు.

సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ టాక్‌తో మొదలై, ఏకంగా 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 3 నేషనల్ అవార్డులు సాధించిన మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ మొదటి రోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. వంశీ పైడిపల్లి బాగా ల్యాగ్ స్క్రీన్ ప్లేతో విసిగించాడంటూ విమర్శలు మూటగట్టుకున్న ఈ మూవీ 100 కోట్ల షేర్ వసూలు చేసి, దిమ్మతిరిగేలా చేసింది.

అలాగే అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు ఓవర్సీస్‌లో డిజాస్టర్ అయింది. అయితే అల్లు అరవింద్ మార్క్ ప్రమోషన్స్‌తో ఇక్కడ అదరగొట్టి, 70 కోట్ల షేర్ రాబట్టింది. అంతేకాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి మూవీ కూడా నెగిటివ్ టాక్‌తోనే ఓపెన్ అయింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చడంతో ఏకంగా 50 కోట్ల షేర్ తీసుకొచ్చి, కొంత నష్టంతో బయటపడింది.

జూనియర్ ఎన్టీఆర్ 25వ సినిమాగా సుకుమార్ డైరెక్షన్ లో విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ మూవీ కూడా తొలిరోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. అర్థం కాని సినిమా చేసాడంటూ ఫ్యాన్స్ కూడా ఆడిపోసుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాకు ఇచ్చిన ప్రమోషన్స్ తో అనూహ్యంగా 54 కోట్ల షేర్ వసూలు చేసి, 5 కోట్ల నష్టాలతో బయట పడింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రెండో సినిమాగా వెంకటేష్ తో తెరకెక్కించిన తులసి మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే మాస్ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో తులసి విజయాన్ని అందుకుంది. రవితేజ, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన పవర్ మూవీ తొలిరోజే టాక్ తేడా కొట్టింది. అయితే సడన్ గా పుంజుకుని, 23 కోట్ల వరకు షేర్ వసూలు చేసి, 2 కోట్ల లాభాలు అందుకుంది.

గోపీచంద్, శివ కాంబినేషన్‌లో వచ్చిన శౌర్యం మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తర్వాత బాక్సాఫీస్ దగ్గర పుంజుకుంది. అలాగే నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు మొదటి రోజు తేడా కొట్టింది. అయితే అదే సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టి, వసూళ్ల వర్షం కురిపించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి తొలిరోజు ప్లాప్ టాక్‌ వచ్చింది. అయితే మాస్ సెంటర్స్‌లో ఈ సినిమా అదరగొట్టేయడంతో 18 కోట్ల లాభాలు తెచ్చింది.

వరస విజయాలతో నేచురల్ స్టార్ నాని దూసుకుపోతున్న సమయంలో ఎంసిఏ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అతడికి గల స్టార్ పవర్‌తో ఈ సినిమా లాభాలు తెచ్చింది. కేవలం నాని, సాయి పల్లవి కారణంగానే ఈ సినిమా హిట్ అయింది. తాజాగా వచ్చిన పెళ్లి సందD మూవీ విషయానికి వస్తే, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నీ తానేయై చేసిన ఈ మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.

తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చేసుకుంది. అయితే 5.50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ 7.50 కోట్ల షేర్ వసూలు చేసి, రెండున్నర కోట్ల లాభాలు తీసుకొచ్చింది. అలా అనూహ్యంగా సూపర్ హిట్ అయింది.