100 % లవ్ సినిమాకి పోటీగా వచ్చి పరాజయం పొందిన సినిమాలు
100 % love Movie : హీరో నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన 100%లవ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్. 65సెంటర్స్ లో 50డేస్ ఆడిన ఈ మూవీ 18కోట్ల షేర్ రాబట్టింది. 2011మే 6న రిలీజైన ఈ మూవీ రెండు నంది అవార్డులను తెచ్చుకుంది.
దీనికి పోటీగా విజయ్, నయనతార జంటగా నటించిన యమ కంత్రి మూవీ ప్రభుదేవా డైరెక్షన్ లో వచ్చింది. అయితే తెలుగులో ప్లాపయింది. 100%లవ్ మూవీ కి రెండు వారాల ముందుగా ఏప్రియల్ 22న బి4 మేరేజ్ మూవీ నిరాశ పరిచింది. అదేరోజు గల్లీ కుర్రోళ్ళు మూవీ రిలీజై, ఫెయిలయింది.
100%లవ్ మూవీ కి రెండు వారాల ముందుగానే బాలాదిత్య, రూపశ్రీ జంటగా నటించిన నిను చేరాలని మూవీ వచ్చింది. నటన బాగున్నా సినిమా ఫెయిల్ అయింది. ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ దశరధ్ డైరెక్షన్ లో వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
100%లవ్ మూవీకి వారం ముందు ఏప్రియల్ 29న రానా హీరోగా వచ్చిన నేను నా రాక్షసి మూవీ కొంత ఆకట్టుకున్నా ఆడియన్స్ ఆదరణ పొందలేదు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఇలియానా హీరోయిన్ గా చేసింది. ఏప్రియల్ 29నే కాఫీ బార్ మూవీ వచ్చింది. శశాంక్ హీరోగా చేసిన ఈ మూవీ ని గీతాకృష్ణ తెరకెక్కించగా, పరాజయం పాలైంది.
ఏప్రియల్ 30న వచ్చిన సింధు తులాని, రాజీవ్ జంటగా నటించిన పాయిజన్ మూవీ ప్లాపయింది. ఏప్రియల్ 7న వైభవ్ రెడ్డి హీరోగా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో జ్వాలా మూవీ వచ్చింది. 100%లవ్ మూవీకి వారం తర్వాత రంగం డబ్బింగ్ మూవీ వచ్చింది. జీవా, కార్తీక జంటగా నటించిన ఈ మూవీ సక్సెస్ అందుకుంది.
ఇదే రోజున అల్లరి నరేష్ హీరోగా హాస్య ప్రధానంగా సీమ టపాకాయ్ మూవీ వచ్చింది. జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మాధవన్, అబ్బాస్ లు నటించిన డబ్బింగ్ మూవీ ప్రేయసి ఆకట్టుకోలేదు. కన్నడలో పాత రికార్డులను బద్దలుకొట్టి తెలుగులో డబ్బింగ్ గా వచ్చిన జాకీ మూవీలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసాడు. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. మే 20న మాస్ మహారాజు రవితేజ నటించిన వీర మూవీ వచ్చింది. కాజల్ హీరోయిన్ గా చేసింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ తొలివారం 6కోట్లు షేర్ తెచ్చిన ఈ మూవీ తర్వాత స్లో అయింది.